చెరువుకట్టపై అక్రమంగా చెట్లు నరికివేత
Published Wed, Jul 20 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
అనుమసముద్రంపేట : మండలంలోని శ్రీకొలను చెరువుకట్టపై ఉన్న సుమారు 30 వేప చెట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా కొట్టి తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. విషయం తెలుసుకున్న ఆగ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు బోయిళ్ల చెంచురెడ్డి సంబందిత డీఈకి ఫోను ద్వారా సమాచారం అందించారు. ఆయన మాట్లాడుతూ చెరువు కట్టపై రూ.50 వేలు విలువ చేసే వేపచెట్లు ఉన్నాయన్నారు. వాటిపై కన్నేసిన కొందరు వ్యక్తులు అక్రమంగా గత మూడురోజులుగా నరుకుతున్నారన్నారు. సంబంధిత అధికారులు ఎందుకు నిమ్మకునీరెత్తినట్లున్నారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా ఈ దీనిపై పీడబ్ల్యూడీ డీఈ రవి మాట్లాడుతూ చెట్లు నరికేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. అక్రమంగా చెట్లు నరికితే చర్యలు తీసుకుంటామన్నారు. నీటి సంఘం అధ్యక్షులు నంది వివేకానందరెడ్డి మాట్లాడుతూ చెరువుకట్ట వద్ద చెట్లు కొన్ని నరికారని తెలిసిందని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement