![it is illegal to photograph the eiffel tower at night - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/22/tower.gif.webp?itok=FlmivpJb)
పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరొందింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించేందుకు ఫ్రాన్స్‌కు తరలివస్తుంటారు. 1889లో ఫ్రాన్స్‌లో నిర్వహించిన వరల్డ్ ఎగ్జిబిషన్‌కు ఎంట్రీ గేటుగా ఈ టవర్ నిర్మాణం ప్రారంభమయ్యింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ రూపంలో నిర్మించారు. తరువాత దీనిని కూల్చివేసే ఆలోచన చేశారు. అయితే దీని అందం, ప్రజాదరణలను దృష్టిలో ఉంచుకుని దీనిని కూల్చివేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు.
ఈఫిల్ టవర్ నిర్మించేందుకు 2 ఏళ్ల 2 నెలల 5 రోజులు పట్టింది. దీని నిర్మాణం 1887 నుంచి 1889 వరకూ సాగింది. ఈఫిల్ టవర్ నిర్మాణంలో సుమారు 300 మంది కూలీలు పాల్గొన్నారు. ఈ అద్భుత కళాకృతి కారణంగా నేడు పారిస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంటుంది.
ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నిషిద్ధం. చట్టరీత్యా ఈ టవర్‌కు రాత్రివేళ పొటోలుతీయడం నేరమని ప్రభుత్వం ప్రకటించింది. ఈఫిల్ టవర్ లైట్లు పారిస్ కాపీరైట్స్ కిందకు వస్తాయి. అందుకే ఎవరైనా రాత్రివేళ ఈఫిల్ టవర్‌కు ఫొటోలు తీయాలనుకుంటే, ముందుగా కాపీరైట్ చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
పారిస్‌ను లవ్ సిటీ అని అంటారు. జంటలకు ఈఫిల్ టవర్ లవ్ స్పాట్ అని చెబుతారు. పారిస్‌కు ఇంతటి జనాదరణ ఉన్న కారణంగానే భారత ప్రధాని నరేంద్రమోదీ తన ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశంలో యూపీఐ పేమెంట్లను ప్రారంభించారు. దీని తొలి పేమెంట్‌ను ఈఫిల్ టవర్ వద్ద నిర్వహించారు. త్వరలో పర్యాటకులు ఈఫిల్ టవర్ ఎంట్రీ ఫీజు చెల్లించేందుకు యూపీఐ పేమెంట్‌ను ఉపయోగించవచ్చు.
ఈఫిల్ టవర్‌లోని కొంతభాగం శీతాకాలంలో ముడుచుకుపోతుంటుంది. ఇప్పటిరకూ 6 ఇంచుల భాగం ముడుచుకుపోయిందని చెబుతుంటారు. ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన మెటల్ చలికి ముడుచుకుపోతుంటుంది. వేసవిలో తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన నిర్మాణాలలో ఈఫిల్ టవర్ ముందు వరుసలో ఉంటుంది. అయితే 1930లో నిర్మించిన న్యూయార్క్‌లోని క్రిస్మస్ బిల్డంగ్ ఎత్తు విషయంలో ఈఫిల్ టవర్‌ను అధిగమించింది.
నిజానికి ఈఫిల్ టవర్‌ను 20 ఏళ్లపాటు నిలిచివుండేలా నిర్మించారు. అయితే ఈ నిర్మాణం జరిగి 20 ఏళ్లు దాటినా అది చెక్కుచెదరకుండా ఉంది. దీని నిర్మాణం జరిగిన 20 ఏళ్ల అనంతరం దీనికి కొన్ని సాంకేతిక పరీక్షలు చేశారు. ఈ నేపధ్యంలో టవర్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉందని తేలింది. అందుకే ఈరోజుకూ ఈఫిల్ టవర్ మనమంతా తలెత్తుకునేలా నిలిచింది.
ఇది కూడా చదవండి: నేపాల్‌లో దాక్కున్న చైనా ‘పెంగ్’.. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూ..
Comments
Please login to add a commentAdd a comment