Nights
-
నిశీధి వీధుల్లో అగ్ని నక్షత్రాలు..
రాత్రిళ్లు తారలు కనపడటం సహజం. కాని కోల్‌కతా వీధుల్లో అగ్ని నక్షత్రాలు దర్శనమిస్తున్నాయి. ‘రీక్లయిమ్ ది నైట్’ పేరుతో మహిళలు అనూహ్య సంఖ్యలో రాత్రిళ్లు దివిటీలతో నిరసనలు చేస్తున్నారు. అభయ ఘటన జరిగి నెల అయిన సందర్భంగా సెప్టెంబర్ 8 రాత్రి కోల్‌కతాలోని ఏ కూడలిలో చూసినా దగ్ధ కాగడాలు చేతబూనిన స్త్రీలే. కోల్‌కతాలో సాగుతున్న నిరసనలపై కథనం.‘రాత్రి ఎవరిది?’ ఈ ప్రశ్న పిక్కటిల్లుతోంది కోల్‌కతాలో. ‘రాత్రి మాది కూడా’ అని అక్కడి స్త్రీలు ఎలుగెత్తి నినదిస్తున్నారు. వందల వేల సంఖ్యలో స్త్రీలు రాత్రిళ్లు బయటకు రావడం... కాగడానో, కొవ్వొత్తినో, సెల్‌ఫోన్ లైట్‌నో వెలిగిస్తూ సామూహికంగా నడవడం... ఆ నగరం ఎప్పుడూ ఎరగదు. ఇప్పుడు చూస్తోంది. ‘కోల్‌కతాలో దుర్గాపూజ సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటుంది. కాని అభయ విషయంలో న్యాయం కోసం స్త్రీలు రోడ్ల మీదకు వస్తున్నారు. పురుషులు కూడా వారికి స΄ోర్ట్ ఇస్తున్నారు’ అంటున్నారు స్త్రీలు.ఎన్నడూ ఎరగని భయంకోల్కతాలో క్రైమ్ రేటు ఉన్నా ఆగస్టు 8 రాత్రి అభయపై జరిగిన అత్యాచారం, హత్యవల్ల నగరం పూర్తిగా భయపడి΄ోతోంది. స్త్రీలు బయటకు రావాలంటేనే సంకోచించే స్థితి ఈ ఘటన తర్వాత చోటు చేసుకున్నా మెల్లమెల్లగా ఎందుకు బయటకు రాకూడదనే తెగింపు కూడా మొదలయ్యింది. ఆగస్టు 14 అర్ధరాత్రి (స్వాతంత్య్రం వచ్చిన సమయం) రాత్రి భారీస్థాయిలో స్త్రీలు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయితే పార్టీలు ఉసికొల్పడం వల్ల ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. కాని ఆ తర్వాత ఏ పార్టీతో సంబంధం లేని రిమ్‌ఝిమ్ శర్మ అనే సామాజిక కార్యకర్త న్యాయం కోసం నిరసన తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో అర్ధరాత్రి నిరసనలకు పిలుపునిచ్చింది. నెప్టెంబర్ 4న కోల్‌కతా పట్టపగలులా మారింది. వేలాదిగా మహిళలు బయటకు వచ్చారు. ఈసారి వారందరి చేతుల్లో పార్టీల జండాలు కాకుండా త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. ఇది జనం నిరసన. కోల్‌కతా నగరం దిగ్గున వెలిగింది– న్యాయ ఆకాంక్షతో.నెల రోజుల రాత్రిఆగస్టు 8 రాత్రి కోల్‌కతాలోని ఆర్.జి. కార్ ఆస్పత్రిలో ‘అభయ’ అనే జూనియర్ డాక్టర్‌పై పాశవికంగా అత్యాచారం, హత్య జరిగి నెల రోజులు అవుతుండటంతో ‘ఇంకా జరగని న్యాయానికి’ నిరసనగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ‘నైట్ ఆఫ్ అభయ’ పేరుతో నిరసనకు సామాజిక కార్యకర్తలు పిలుపునివ్వడంతో కోల్‌కతాతో పాటు ముఖ్యపట్టణాల్లో స్త్రీలు సెప్టెంబర్ 8 (ఆదివారం) రాత్రి వేలాదిగా రోడ్ల మీదకు వచ్చారు. నినాదాలు, పాటలు, కవితలు... రోడ్ల మీద బొమ్మలు వేయడం ఎక్కడ చూసినా చైతన్యజ్వాలలు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’ నినాదం మార్మోగి΄ోయింది. సి.బి.ఐ అనునిత్యం ఏవో స్టేట్మెంట్లు ఇవ్వడం ఆస్పత్రిలోని మూడు గదులను త్రీడి మ్యాపింగ్ ద్వారా విశ్లేషిస్తున్నామని చెప్పడం పాలిగ్రాఫ్ పరీక్షలు చేయించడం తప్ప అసలు ఏం జరిగిందో దీని వెనుక ఎవరున్నారో తెలుపడం లేదు. అభయ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 9న (నిన్న) విచారణ చేసినా అందులో అటాప్సీ రి΄ోర్టులో కీలకపత్రం లేక΄ోవడాన్ని గుర్తించి నిలదీసింది. అంటే ఈ కేసు అంతు లేకుండా సాగేలా ఉంది.గగుర్పాటు క్షణం‘ఘటన జరిగి నెల రోజులైనా నా కూతురు ఆ క్షణంలో ఎంత తల్లడిల్లి ఉంటుందో గుర్తుకొస్తే నేటికీ గగుర్పాటుకు గురవుతూనే ఉన్నాను’ అని అభయ తల్లి సెప్టెంబర్ 8 రాత్రి నిరసనలో తెలిపింది. మరోవైపు ఆర్.జి. కార్ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు ఆస్పత్రిలోని పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదని, íసీసీ కెమెరాలు బిగించలేదని, భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రోడ్లపైకి వస్తున్న మహిళలను అడిగితే ‘దేశంలో పెరిగి΄ోయిన రేప్ కల్చర్‌తో విసిగి΄ోయాం. దీనికి ముగింపు పలకాల్సిందే. అంతవరకూ రోడ్ల మీదకు వస్తూనే ఉంటాం’ అంటున్నారు. ఏ జాగృదావస్థ అయినా ప్రక్షాళనకే దారి తీస్తుంది. ఈ ప్రక్షాళనే ఇప్పుడు కావాల్సింది. -
సందేశ్‌ఖాలీలో మళ్లీ ఉద్రిక్తత.. అప్రమత్తమైన పోలీసులు!
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని బసిర్హాట్ సబ్ డివిజన్లో ఉన్న సందేశ్‌ఖాలీలో బుధవారం అర్ధరాత్రి మరోమారు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. సందేశ్‌ఖలీలో రైతులు, పేదల భూములను టీఎంసీ నాయకులు ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలున్నాయి. టీఎంసీ నేతల వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఈ నిరసనల్లోకి దిగింది. టీఎంసీ నేత షాజహాన్తో సహా నిందితులందరినీ అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా సందేశ్‌ఖాలీలో కొనసాగుతున్న హింసాకాండ కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు చీఫ్‌కి నోటీసు పంపింది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలోని సందేశ్‌ఖాలీలో ఒక రాజకీయ నేత మద్దతుదారులు పేద మహిళలను హింసించారని ఆరోపిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన నివేదికలను ఎన్హెచ్ఆర్సీ స్వీకరించింది. సందేశ్‌ఖాలీలో ఇటీవల జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేసేలా మానవ హక్కుల ఉల్లంఘనలను సూచిస్తున్నాయని కమిషన్ పేర్కొంది. ఈ ఘటనల్లో పాలుపంచుకున్నవారిపై చేపట్టిన చర్యలకు సంబంధించి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీ చేసింది. -
చీకట్లోనూ స్పష్టంగా చూపిస్తుంది..
రాత్రివేళ చీకట్లో దగ్గరగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడటం సాధ్యం కాదు. చీకట్లో భూతద్దాలను ఉపయోగించినా ఫలితం ఉండదు. ఈ బైనాక్యులర్ చేతిలో ఉంటే మాత్రం చీకట్లోనూ దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. జపాన్‌కు చెందిన కెమెరాల తయారీ కంపెనీ ‘యాషికా’ ఇటీవల ఈ నైట్‌విజన్ బైనాక్యులర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని ఫిక్స్డ్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, దూరంగా ఉన్న వస్తువులు మూడురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, ఐదురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ కెమెరాల మాదిరిగానే దీనికి నాలుగు అంగుళాల హై డెఫినిషన్ డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా చీకట్లో 600 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుల రంగులను సైతం స్పష్టంగా చూడవచ్చు. ఇందులోని 512 జీబీ ఎక్స్టర్నల్ మెమరీకార్డ్‌లో చూసిన దృశ్యాలను రికార్డు చేసుకోవచ్చు. ఇది బైనాక్యులర్‌గా మాత్రమే కాకుండా, వీడియో కెమెరాగా కూడా పనిచేస్తుంది. దీని ధర 169 డాలర్లు (రూ. 14,050) మాత్రమే! ఇవి చదవండి: మొక్కల నుంచి వచ్చే సంగీతాన్ని వినొచ్చు తెలుసా! -
జపాన్‌లో దీపావళిని పోలిన పండగ ఉంది తెలుసా!
మన దీపావళి ఇటీవలే జరిగింది. అచ్చం మన దీపావళిని పోలిన పండుగనే జపానీయులు కూడా ఏటేటా జరుపుకొంటారు. ఈ పండుగ పేరు ‘చిచిబు యమాత్సురి’– అంటే రాత్రి వేడుక అని అర్థం. దాదాపు మూడు శతాబ్దాలుగా జపానీయులు ఈ పండుగను జరుపుకొంటూ వస్తున్నారు. ఇది రెండు రోజుల పండుగ. ప్రతి ఏటా డిసెంబర్ 2, 3 తేదీల్లో జపాన్ ప్రజలు ఘనంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఒకుచిచిబు పర్వతసానువుల దిగువన ఉండే చిచిబు పట్టణంలో ఈ వేడుకలు జరుగుతాయి. రాజధాని టోక్యో సహా వివిధ నగరాలు, పట్టణాలకు చెందిన ప్రజలు ఇక్కడకు చేరుకుని, ఘనంగా పండుగ చేసుకుంటారు. సాయంత్రం చీకటి పడుతూనే ప్రార్థన మందిరాలను, ఇళ్లను సంప్రదాయబద్ధమైన లాంతరు దీపాలతో అలంకరిస్తారు. వీథుల్లో ఊరేగింపులు జరుపుతారు. ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పండుగ మొదటి రోజున ప్రార్థనలు, విందు వినోదాలతో గడుపుతారు. రెండోరోజైన డిసెంబర్ 3న రాత్రి వేళ ఇళ్లను, ప్రార్థన మందిరాలను లాంతరు దీపాలతో అలంకరించి, భారీ ఎత్తున బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకల్లో చిచిబు పట్టణం బాణసంచా కాల్పులతో హోరెత్తుతుంది. ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే బాణసంచా మెరుపులు కనిపిస్తాయి. రంగు రంగుల తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వంటి బాణసంచా కాల్పుల్లో పిల్లలూ పెద్దలూ అంతా ఉత్సాహంగా పాల్గొంటారు. చిచిబు పట్టణంలోని ప్రధాన ప్రార్థన మందిరమైన చిచిబు మందిరంలో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఈ మందిరం రాత్రివేళ దీపకాంతులతో ధగధగలాడిపోతుంది. వేలాది మంది జనాలు ఇక్కడకు చేరుకుని, బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ మందిరం నుంచి కలపతో తయారు చేసిన రథాల వంటి ‘యతాయి’ వాహనాలను దీపాలతో అలంకరించి వీథుల్లో ఊరేగిస్తూ బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. (చదవండి: అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే! అణు రియాక్టర్ పేలుడు ఏదీ సంభవించలేదు కానీ..!) -
ఆకాశంలో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయట!
రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే. ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. మనం చూసేది పాలపుంతే కాదు..! మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది. -
హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది? ఇదేమైనా సంప్రదాయమా?
హిజ్రాల జీవితాల్లో ఎన్నో రహస్యాలు దాగివుంటాయి. అందుకే వారి జీవితం ఎలా సాగుతుంది? వారికి వివాహాలు జరుగుతాయా? వారు జంటగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష పాత్రలను పోషిస్తారా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. నిజానికి ప్రతీ హిజ్రా తన జీవితంలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. అయితేవారు ఒక రాత్రికి మాత్రమే వధువుగా మారుతారు. ఇదేమీ విచిత్రం కాదు. వారి సమాజంలో ఇది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. పురాతన గ్రంథాలలో హిజ్రాలను యక్షులు, గంధర్వులతో సమానంగా పరిగణించారు. మహాభారతం నుండి యక్ష పురాణం వరకు శిఖండి, మోహిని లాంటి పాత్రలు కనిపిస్తాయి. అయితే మన సమాజంలో హిజ్రాలను ప్రత్యేకంగా చూస్తుంటారు. అందుకే హిజ్రాలు తమకంటూ ఒక సమాజాన్ని సృష్టించుకుంటారు. వారి అంత్యక్రియలు, వివాహాలు వారి సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా కొనసాగుతాయి. దక్షిణ భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే హిజ్రాల ఉత్సవాన్ని కూవగం జాతర అని అంటారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఏప్రిల్ 18న ప్రారంభమై మే 03 వరకు జరిగింది. ఇందులో మే 02, 03 తేదీల్లో హిజ్రాల వివాహాలు జరిగాయి. ఈ జాతర తమిళనాడులోని కూవగం అనే గ్రామంలో జరుగుతుంది ఈ జాతర 18 రోజుల పాటు కొనసాగుతుంది. దేశం నలుమూలల నుండి హిజ్రాలు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశం తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజ్రాల దేవుడిగా భావించే అరవాన్ దేవతకు వారు ఆరోజుల్లో పూజలు చేస్తారు. జాతరలో హిజ్రాల కళ్యాణం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. మహాభారతంలో అరవన్ అనే దేవుని పేరు ప్రస్తావనకు వస్తుంది. అతను.. అర్జునుడు- యువరాణి ఉలూపి కుమారుడు. మహాభారత కథ ప్రకారం యుద్ధ సమయంలో కాళీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు అరవన్ తనను తాను త్యాగం చేసుకునేందుకు సిద్ధమవుతాడు. అయితే పెళ్లి కాకుండా చనిపోవడం ఇందుకు అనువైనది కాదనేది షరతు. అటువంటి పరిస్థితిలో శ్రీ కృష్ణుడు మోహిని రూపాన్ని ధరించి అరవన్‌ను వివాహం చేసుకుంటాడు. అరవన్ మరణించిన మరుసటి రోజు ఉదయం మోహిని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు వితంతువులా రోదించాడని చెబుతారు. ఈ కథను ఆధారంగా చేసుకుని హిజ్రాలు అరవన్‌ను ఒక రోజు వివాహం చేసుకుంటారు. మరుసటి రోజు వారు వితంతువులుగా మారి పెద్దపెట్టున విలపిస్తారు. పెళ్లి రోజన హిజ్రాలు అరవన్‌ను తమ భర్తగా భావించి, తమను తాము నవ వధువులా అలంకరించుకుంటారు. ఆలయ పూజారులు వారికి మంగళసూత్రం ధరించేలా ఏర్పాట్లు చేస్తారు. మరుసటి రోజు వారు అరవన్ చనిపోయినట్లు భావించి, వితంతువులు అవుతారు. అప్పుడు హిజ్రాలు తమ అలంకరణను తొలగించుకుని పెద్ద పెట్టున రోదిస్తారు. హిజ్రాల పరిస్థితి భారత్‌లోనే కాదు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలలో కూడా దారుణంగా ఉంది. స్త్రీల వేషధారణలో ఉంటూ, వారు సమాజానికి దూరంగా ఉంటున్నారు. పలు పాశ్చాత్య దేశాలలో హిజ్రాలు సామాన్య ప్రజల మధ్యనే ఉంటారు. వారు కూడా వివాహం చేసుకుని బిడ్డను దత్తత తీసుకుంటుంటారు. ఛాందసవాద సమాజం వారిని ప్రధాన స్రవంతి నుండి వేరు చేస్తున్నదనే వాదనలు వినిపిస్తుంటాయ. ఇది కూడా చదవండి: 4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు! -
ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నేరం.. కారణం ఇదే!
పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరొందింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించేందుకు ఫ్రాన్స్‌కు తరలివస్తుంటారు. 1889లో ఫ్రాన్స్‌లో నిర్వహించిన వరల్డ్ ఎగ్జిబిషన్‌కు ఎంట్రీ గేటుగా ఈ టవర్ నిర్మాణం ప్రారంభమయ్యింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ రూపంలో నిర్మించారు. తరువాత దీనిని కూల్చివేసే ఆలోచన చేశారు. అయితే దీని అందం, ప్రజాదరణలను దృష్టిలో ఉంచుకుని దీనిని కూల్చివేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఈఫిల్ టవర్ నిర్మించేందుకు 2 ఏళ్ల 2 నెలల 5 రోజులు పట్టింది. దీని నిర్మాణం 1887 నుంచి 1889 వరకూ సాగింది. ఈఫిల్ టవర్ నిర్మాణంలో సుమారు 300 మంది కూలీలు పాల్గొన్నారు. ఈ అద్భుత కళాకృతి కారణంగా నేడు పారిస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంటుంది. ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నిషిద్ధం. చట్టరీత్యా ఈ టవర్‌కు రాత్రివేళ పొటోలుతీయడం నేరమని ప్రభుత్వం ప్రకటించింది. ఈఫిల్ టవర్ లైట్లు పారిస్ కాపీరైట్స్ కిందకు వస్తాయి. అందుకే ఎవరైనా రాత్రివేళ ఈఫిల్ టవర్‌కు ఫొటోలు తీయాలనుకుంటే, ముందుగా కాపీరైట్ చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పారిస్‌ను లవ్ సిటీ అని అంటారు. జంటలకు ఈఫిల్ టవర్ లవ్ స్పాట్ అని చెబుతారు. పారిస్‌కు ఇంతటి జనాదరణ ఉన్న కారణంగానే భారత ప్రధాని నరేంద్రమోదీ తన ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశంలో యూపీఐ పేమెంట్లను ప్రారంభించారు. దీని తొలి పేమెంట్‌ను ఈఫిల్ టవర్ వద్ద నిర్వహించారు. త్వరలో పర్యాటకులు ఈఫిల్ టవర్ ఎంట్రీ ఫీజు చెల్లించేందుకు యూపీఐ పేమెంట్‌ను ఉపయోగించవచ్చు. ఈఫిల్ టవర్లోని కొంతభాగం శీతాకాలంలో ముడుచుకుపోతుంటుంది. ఇప్పటిరకూ 6 ఇంచుల భాగం ముడుచుకుపోయిందని చెబుతుంటారు. ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన మెటల్ చలికి ముడుచుకుపోతుంటుంది. వేసవిలో తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన నిర్మాణాలలో ఈఫిల్ టవర్ ముందు వరుసలో ఉంటుంది. అయితే 1930లో నిర్మించిన న్యూయార్క్‌లోని క్రిస్మస్ బిల్డంగ్ ఎత్తు విషయంలో ఈఫిల్ టవర్‌ను అధిగమించింది. నిజానికి ఈఫిల్ టవర్‌ను 20 ఏళ్లపాటు నిలిచివుండేలా నిర్మించారు. అయితే ఈ నిర్మాణం జరిగి 20 ఏళ్లు దాటినా అది చెక్కుచెదరకుండా ఉంది. దీని నిర్మాణం జరిగిన 20 ఏళ్ల అనంతరం దీనికి కొన్ని సాంకేతిక పరీక్షలు చేశారు. ఈ నేపధ్యంలో టవర్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉందని తేలింది. అందుకే ఈరోజుకూ ఈఫిల్ టవర్ మనమంతా తలెత్తుకునేలా నిలిచింది. ఇది కూడా చదవండి: నేపాల్‌లో దాక్కున్న చైనా ‘పెంగ్’.. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూ.. -
వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?..
పెట్రోల్, డీజిల్ వినియోగానికి సంబంధించి వినియోగదారులలో చాలా అపోహలు తలెత్తుతుంటాయి. కారు మైలేజీ పెంచుకునే ఉపాయాలు మొదలుకొని పెట్రోల్ ధర వరకూ చాలామందిలో నిత్యం చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో కొందరు వాహనంలో పెట్రోల్ పోయించేందుకు ప్రత్యేక సమయం ఉందని చెబుతూ, ఆ సమయంలోనే ఇంధనం పోయించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పెట్రోల్ పోయించేందుకు ఉదయం తగిన సమయం అని చాలామంది చెబుతుంటారు. కొందరు దీనిని ఖండిస్తూ, రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించడం ఉత్తమం అని అంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో పెట్రోల్ పోయించేందుకు తగిన సమయం ఏదనే ప్రశ్న మనలో తలెత్తుతుంటుంది. నిజానికి ఇటువంటి వాదనలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతుంటాయి. పైగా ఈ అంశానికి సంబంధించి ఇంటర్నెట్లో పలు ఆర్టికల్స్ కూడా కనిపిస్తుంటాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! వీటిలో రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించకూడదని, తెల్లవారుజామునే పెట్రోల్ పోయిస్తే డబ్బులు ఆదా అవుతాయని, వాహనంలో అధికంగా పెట్రోల్ పడుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో నిజం ఏమేరకు ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వేడి కారణంగా ఇంధనం విస్తరిస్తుంది. అందుకే ఉదయం తెల్లవారుతున్న సమయంలో వాహనంలో పెట్రోల్ పోయిస్తే, అధికంగా నిండుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో వాస్తవం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ప్రపంచంలోని అత్యధిక ఇంధన స్టేషన్లలో భూమిలోపల ట్యాంకులలో పెట్రోల్ లేదా డీజిల్ రిజర్వ్ చేస్తుంటారు. ఫలితంగా ఇంధన ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. పైగా ట్యాంకులకు అత్యధిక దళసరితో కూడిన మూతలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే వాహనంలో ఏ సమయంలో పెట్రోల్ పోయించినా దానిపై ఉష్ణోగ్రత ప్రభావం పడదు. ఇందన సంకోచ, వ్యాకోచాలలో తేడా ఏర్పడదు. అందుకే ఉదయం వేళలో వాహనంలో పెట్రోల్ పోయించినప్పటికీ ఎటువంటి తేడా రాదు. తెల్లవారుజామున పెట్రోల్ పోయించడం వలన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
పెళ్లి కోసం వరుడు పాట్లు..రాత్రంత కాలినడకన వెళ్లి మరీ తాళి కట్టాడు!
డ్రైవర్ల సమ్మె కారణంగా వరడు నానాపాట్లు పడ్డాడు. పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడ్డాడు. చివరికి వరుడు కుటుంబం కాలినిడకన వధువు ఇంటికి చేరుకుని మరీ ఆ వధవరులకు వివాహం జరిపించారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కల్యాణ్ సింగ్‌పూర్ బ్లాక్ పరిధిలోని సునఖండి పంచాయతీలో నివసిస్తున్న వరుడు 28 కి.మీ దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి రాత్రంతా నడిచి మరి వధువు ఇంటికి చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే శుక్రవారం ఆ జంటకి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ ఏక్తా మహాసంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మే చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని తమ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిలిపేశారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పి కె జెనా, డీజేపీ ఎస్ కే బన్సక్ సమ్మెను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలే డ్రైవర్ల ఏక్తా మహాసంఘ్ సమ్మెను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్ల సమ్మె కారణంగా కార్యాలయాలకు వెళ్లేవారు, పర్యాటకులు, సామాన్యులు ఎంతగానే ఇబ్బందిపడ్డారు. ఈ సమ్మె కారణంగా ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి కూడా. (చదవండి: మద్యం మత్తులో కళ్యాణ మండపానికి వెళ్లడం మర్చిపోయిన వరుడు) -
రాత్రిళ్లూ బస్సు సర్వీసులు
ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి గుంటూరు (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులు, ఉచిత బస్సుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే దానిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి శనివారం స్వయంగా పుష్కర్నగర్లోని బస్సుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రయాణీకులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి పది గంటల నుంచి సత్తెనపల్లి, పెదకూరపాడుతోపాటు ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేందుకు బస్సులు అందుబాటులో ఉండటం లేదని వారు చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్ల వద్ద అన్ని ప్రాంతాలకు బస్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. దీంతో స్పందించిన ఆర్ఎం శ్రీహరి రాత్రి వేళల్లో 50 బస్సులు అదనంగా ఉంచి అవసరమైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్ వద్ద కంట్రోలర్‌ను ఏర్పాటు చేశామన్నారు. -
విద్యార్థులు గజ..గజ !
‘చలి-పులి’కి ఎవరైనా ఒక్కటే. మాన్యులు..సామాన్యులు అనే తేడా ఉండదు..చిన్నా పెద్దా అనే తారతమ్యం అంతకంటే ఉండదు. శీతాకాలం ఆరంభంలో గిలిగింతలు పెట్టిన చలిపులి రానురాను వణుకు పుట్టిస్తోంది. రాత్రిళ్లు రోడ్డుపైకి రావాలంటేనే గజగజలాడే పరిస్థితి ఏర్పడింది. ఉధృతమవుతున్న చలిగాలులకు కాళ్లు చేతులు కొంగర్లు పోతున్నాయి. ఇళ్ల కిటికీలు, తలుపులను తోసుకువస్తున్న చలిపులికి అంతా ఠారెత్తుతున్నారు. రాత్రిళ్లు దుప్పట్లు, రగ్గుల్లో ముసుగు తన్ని నిద్రిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థుల ‘చలి-బాధలు’ తెలుసుకునేందుకు ‘సాక్షి’ చిరు ప్రయత్నం చేసింది. జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ వసతి గృహాలను మంగళవారం రాత్రి సందర్శించింది. విద్యార్థుల కష్టాలను కళ్లారా చూసింది. పడుకునేందుకు కనీసం చాపలు కూడా లేని పరిస్థితి.. గదుల్లో గచ్చుపైనే నిద్ర.. చలికి ఈకవ తీసిన బండలపై పల్చటి దుప్పటి పరుచుకుని, మరో పల్చటి దుప్పటి కప్పుకుని నిద్రించాల్సిన దుస్థితి. కొన్ని చోట్ల దుప్పట్లు కూడా లేక ఇక్కట్లు పడుతున్న విద్యార్థులు... రెక్కలు లేని కిటికీలు స్వేచ్ఛగా చలిగాలులను స్వాగతిస్తుంటే లోపల గజగజ వణకుతున్న విద్యార్థులే అన్ని చోట్లా కనిపించారు. -
నీటి కోసం..జాగారం
కల్వకుర్తి, న్యూస్‌లైన్: గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. దీంతో మహిళలు పొలానికి వెళ్లి పనిచేయడం మాని ప్రత్యేకంగా తాగునీటి కోసం వేచి ఉండే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులతో బిజీబిజీగా ఉండే గ్రామీణ ప్రజలు తాగునీటి కోసమే ఎక్కువ సమయం కేటాయించే దుస్థితి నెలకొంది. దీనికి తోడు విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో, ఉన్న కొద్ది పాటి నీటిని కరెంట్ వచ్చినపుడే సరఫరా చేస్తున్నారు. దీంతో మహిళలు రాత్రిళ్లు జాగారం చేస్తూ నీటికోసం పాట్లు పడుతున్నారు. నీళ్లున్నా..తప్పని తిప్పలు కొన్ని గ్రామాల్లోని బోర్లలో సరపడా నీళ్లున్నా నిర్వహణ లోపం, బోరుమోటార్లకు మరమ్మతు లు చేయించ కపోవడంతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో ఉండే అధికారులకు సమాచారం చేరడం, వారి స్పందించి తీరిక సమయంలో గ్రామానికి చేరుకొని మోటార్లను బాగుచేయించే నాటికి వారం, పది రోజులు పడుతోంది. బారులుతీరుతున్న జనం.. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లు అడుగంటే స్థితికి చేరుకున్నాయి. గతంలో పదుల సంఖ్యలో ఉండి, కాలనీలన్నింటికీ నీరందించే చేతిప ంపులు ప్రస్తుతం దిష్టిబొమ్మల్లా మారాయి. మరికొన్ని గ్రామాల్లో వచ్చే కొద్దిపాటి కోసం గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు. తాగేందుకే నీరు సరిపడా ఉండటంలేదని, దీనికి తోడు కుంటలు, చెరువులు ఎప్పుడో ఎండిపోవడంతో మేకలు, పశువులకు తాగునీరులేక అల్లాడుతున్నాయని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేళాపాలా లేకుండా విద్యుత్ అధికారులు కోతలు విధిస్తుండటంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమైంది.