చీకట్లోనూ స్పష్టంగా చూపిస్తుంది.. | See Clearly Using Nightvision Binoculars | Sakshi
Sakshi News home page

చీకట్లోనూ స్పష్టంగా చూపిస్తుంది..

Published Mon, Jan 29 2024 12:50 PM | Last Updated on Mon, Jan 29 2024 1:06 PM

See Clearly Using Nightvision Binoculars - Sakshi

రాత్రివేళ చీకట్లో దగ్గరగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడటం సాధ్యం కాదు. చీకట్లో భూతద్దాలను ఉపయోగించినా ఫలితం ఉండదు. ఈ బైనాక్యులర్‌ చేతిలో ఉంటే మాత్రం చీకట్లోనూ దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. జపాన్‌కు చెందిన కెమెరాల తయారీ కంపెనీ ‘యాషికా’ ఇటీవల ఈ నైట్‌విజన్‌ బైనాక్యులర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది 5000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల రీచార్జబుల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది.

ఇందులోని ఫిక్స్‌డ్‌ ఆప్టికల్‌ జూమ్‌ను ఉపయోగిస్తే, దూరంగా ఉన్న వస్తువులు మూడురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్‌ ఆప్టికల్‌ జూమ్‌ను ఉపయోగిస్తే, ఐదురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్‌ కెమెరాల మాదిరిగానే దీనికి నాలుగు అంగుళాల హై డెఫినిషన్‌ డిస్‌ప్లే ఉంటుంది. దీని ద్వారా చీకట్లో 600 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుల రంగులను సైతం స్పష్టంగా చూడవచ్చు. ఇందులోని 512 జీబీ ఎక్స్‌టర్నల్‌ మెమరీకార్డ్‌లో చూసిన దృశ్యాలను రికార్డు చేసుకోవచ్చు. ఇది బైనాక్యులర్‌గా మాత్రమే కాకుండా, వీడియో కెమెరాగా కూడా పనిచేస్తుంది. దీని ధర 169 డాలర్లు (రూ. 14,050) మాత్రమే!

ఇవి చదవండి: మొక్కల నుంచి వచ్చే సంగీతాన్ని వినొచ్చు తెలుసా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement