Binoculars
-
విహంగం.. వీక్షణం..
బైనాక్యులర్స్, కెమెరాలతో బర్డ్ లవర్స్ సిద్ధమవుతున్నారు. ఆకాశానికి ఎక్కుపెట్టిన చూపులతో విహంగాలను తీక్షణంగా వీక్షించనున్నారు. అరుదైన అందాలను కెమెరాలతో బంధించనున్నారు. బర్డ్ అట్లాస్ పేరిట సమగ్ర విహంగ విశేషవాహిని రూపకల్పనలో మేము సైతం అంటూ పాలు పంచుకోనున్నారు నగరంలోని పలువురు పక్షి ప్రేమికులు. నగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోయిన పరిస్థితుల్లో జీవవైవిధ్యం కనుమరుగవుతోంది. అదే క్రమంలో ఎన్నెన్నో అరుదైన పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రేమికుల ఆలోచనల్లో నుంచే బర్డ్ అట్లాస్ ఊపిరిపోసుకుంది. నగరాల్లో పక్షుల సంచారాన్ని గుర్తించడం, సమగ్ర వివరాలతో డేటాను మ్యాప్ రూపంలో తయారు చేయడం తద్వారా వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడం వంటి లక్ష్యాలతో రూపొందేదే బర్డ్ అట్లాస్. మొదట ఈ తరహా రాష్ట్ర వ్యాప్త బర్డ్ అట్లాస్‌ను రూపొందించిన ఘనత కేరళ సొంతం చేసుకోగా.. నగరాలకు సంబంధించి కొయంబత్తూర్, మైసూర్ మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేశాయి. వాటి తర్వాత హైదరాబాద్ కూడా సిద్ధమై వాటి సరసన నిలిచేందుకుప్రయత్నిస్తోంది.. 700 మంది వాలంటీర్లు.. నగర జీవవైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం, పరిరక్షించడంలో భాగంగా పక్షుల విశేషాలను ఒడిసిపట్టుకునేందుకు బర్డ్ అట్లాస్ రూపకల్పనలో నగరానికి చెందిన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, హైదరాబాద్ బర్డ్ పాల్స్, డెక్కన్ బర్డర్స్ సంస్థలు చేతులు కలిపాయి. నగరం, చుట్టుపక్కల లేక్స్, పార్క్స్ నుంచి ఔటర్ రింగ్ రోడ్‌లోని అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలతో పాటు 180 సెల్స్ (పక్షుల జాడ కనిపించే ప్రాంతాలను) గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సర్వేలో పాల్గొనే వాలంటీర్ల రిజి్రస్టేషన్ ప్రక్రియ నవంబర్‌లో ప్రారంభం కాగా, గత డిసెంబర్లో పూర్తయ్యింది. ఇప్పటికి 700 మంది వాలంటీర్లుగా నమోదయ్యారు. వీరిని 90 లేదా 45 బృందాలుగా విభజించనున్నారు. జనవరి నెల మొత్తం ఈ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.పక్షులపై పట్టణీకరణ ప్రభావం.. ‘బర్డ్ అట్లాస్‌లు శాస్త్రవేత్తలు, పర్యావరణ పరిరక్షకులు, విధాన నిర్ణేతలకు అమూల్యమైన సాధనాలు. అవి పక్షుల జనాభాలో మార్పులను విశ్లేషించడంలో సంతానోత్పత్తి స్థలాలు, వలసలను నిలిపివేసే ప్రదేశాలు తదితర కీలకమైన విషయాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఈ డేటా పక్షి జనాభా క్షీణత లేదా మార్పులు వంటి ముఖ్యమైన పోకడలను వెల్లడిస్తుంది. తద్వారా జీవవైవిధ్యానికి హాని చేయకుండా నగరాభివృద్ధి, విస్తరణ జరిపేందుకు సహకరిస్తాయి అని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్‌కు చెందిన ఫరీదా తంపాల్, హైదరాబాద్ బర్డ్ పాల్స్ ప్రతినిధి, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శ్రీరామ్‌రెడ్డి, డెక్కన్ బర్డర్స్కు చెందిన సు«దీర్మూర్తి అంటున్నారు. ‘పక్షి జాతులను పట్టణీకరణ ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై అట్లాస్ అవగాహన అందిస్తుంది. భవిష్యత్తులో మానవ కార్యకలాపాలు, వాటిని ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది’ అని వీరు స్పష్టం చేస్తున్నారు. నగర పర్యావరణ పరిరక్షణకు వీలు కలిగేలా వీరు చేపట్టిన బృహత్తర యత్నం విజయవంతం కావాలని.. ఆకాశహార్మ్యాలతో పాటు ఆకాశంలో విహరించే పక్షులు కూడా పెద్ద సంఖ్యలో మనకి కనువిందు చేయాలని కోరుకుందాం. మూడేళ్ల పాటు సాగనున్న వేట.. సంవత్సరానికి రెండు సార్లు–శీతాకాలంలో (ఫిబ్రవరి) వేసవిలో (జూలై) ఒకసారి.. ఇలా మూడు సంవత్సరాల పాటు పక్షుల సర్వేలను నిర్వహిస్తారు. తొలిగా వచ్చే ఫిబ్రవరిలో సర్వే ప్రారంభం అవుతుంది. టీమ్స్, వాలంటీర్ల వెసులుబాటును బట్టి ఆ నెల మొత్తం సర్వే కొనసాగుతుంది. అనంతరం మ్యాప్ తయారు చేస్తారు. ఇదే విధంగా మూడేళ్ల పాటు ఈ క్రతువు కొనసాగుతుంది. -
చీకట్లోనూ స్పష్టంగా చూపిస్తుంది..
రాత్రివేళ చీకట్లో దగ్గరగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడటం సాధ్యం కాదు. చీకట్లో భూతద్దాలను ఉపయోగించినా ఫలితం ఉండదు. ఈ బైనాక్యులర్ చేతిలో ఉంటే మాత్రం చీకట్లోనూ దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. జపాన్‌కు చెందిన కెమెరాల తయారీ కంపెనీ ‘యాషికా’ ఇటీవల ఈ నైట్‌విజన్ బైనాక్యులర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని ఫిక్స్డ్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, దూరంగా ఉన్న వస్తువులు మూడురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, ఐదురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ కెమెరాల మాదిరిగానే దీనికి నాలుగు అంగుళాల హై డెఫినిషన్ డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా చీకట్లో 600 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుల రంగులను సైతం స్పష్టంగా చూడవచ్చు. ఇందులోని 512 జీబీ ఎక్స్టర్నల్ మెమరీకార్డ్‌లో చూసిన దృశ్యాలను రికార్డు చేసుకోవచ్చు. ఇది బైనాక్యులర్‌గా మాత్రమే కాకుండా, వీడియో కెమెరాగా కూడా పనిచేస్తుంది. దీని ధర 169 డాలర్లు (రూ. 14,050) మాత్రమే! ఇవి చదవండి: మొక్కల నుంచి వచ్చే సంగీతాన్ని వినొచ్చు తెలుసా! -
నైట్‌విజన్ బైనాక్యులర్.. చీకట్లోనూ స్పష్టంగా చూపిస్తుంది..
రాత్రివేళ చీకట్లో దగ్గరగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడటం సాధ్యం కాదు. చీకట్లో భూతద్దాలను ఉపయోగించినా ఫలితం ఉండదు. ఈ బైనాక్యులర్ చేతిలో ఉంటే మాత్రం చీకట్లోనూ దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. జపాన్‌కు చెందిన కెమెరాల తయారీ కంపెనీ ‘యాషికా’ ఇటీవల ఈ నైట్‌విజన్ బైనాక్యులర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని ఫిక్స్డ్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, దూరంగా ఉన్న వస్తువులు మూడురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, ఐదురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ కెమెరాల మాదిరిగానే దీనికి నాలుగు అంగుళాల హై డెఫినిషన్ డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా చీకట్లో 600 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుల రంగులను సైతం స్పష్టంగా చూడవచ్చు. ఇందులోని 512 జీబీ ఎక్స్టర్నల్ మెమరీకార్డ్‌లో చూసిన దృశ్యాలను రికార్డు చేసుకోవచ్చు. ఇది బైనాక్యులర్‌గా మాత్రమే కాకుండా, వీడియో కెమెరాగా కూడా పనిచేస్తుంది. దీని ధర 169 డాలర్లు (రూ. 14,050) మాత్రమే! -
వైఎస్సార్టీపీకి బైనాక్యులర్ గుర్తు కేటాయింపు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ బైనాక్యులర్ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగనుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇది కూడా చదవండి: ఫైనల్ స్టేజ్‌కు కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఐదు స్థానాలపై టెన్షన్! -
FIFA WC: బైనాక్యులర్స్‌లో బీర్.. అడ్డంగా దొరికిన అభిమాని
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడం నిషేధంలో ఉంది. కాకపోతే స్టేడియానికి కొంత దూరంలో బయట అమ్ముకునేందుకు వీలు కల్పించారు. అయితే కొందరు అభిమానులు అధికారుల పర్మిషన్తో మద్యంను స్టేడియాల్లోకి తీసుకొస్తున్నారు. మద్యం తాగడం తాము తప్పబట్టమని.. కానీ తాగి స్టేడియంలో పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కానీ ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే కాస్త ఉద్రిక్తత ఉంటుంది. ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందోననే కుతూహలంతో మందు కాస్త ఎక్కువ తాగాలనుకుంటారు. అందుకే కొందరు దొంగచాటుగా పోలీసులు, సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి మద్యం స్టేడియం లోపలికి తీసుకురావాలని చూసి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఒక అభిమాని తన బైనాక్యులర్స్‌లో బీర్‌ను తీసుకెళ్లడం అందరిని షాక్‌కు గురి చేసింది. చెకింగ్ సమయంలో సెక్యూర్టీ గార్డ్ ఆ బైనాక్యులర్స్ లెన్స్ తీశాడు. అయితే ఆ బైనాక్యులర్‌లో ద్రవం రూపంలో ఏదో ఉన్నట్లు గుర్తించాడు. శానిటైర్ తీసుకెళ్తున్నట్లు సదరు అభిమాని చెప్పినప్పటికి అధికారులు వినలేదు. ఆ తర్వాత బైన్యాక్యులర్స్లో ఉన్న ద్రవాన్ని వాసన చూడగా అది అల్కాహాల్ అని తేలడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం తెచ్చుకోవడం తప్పు కాదని.. కానీ ఇలా మా కళ్లు గప్పి తేవడం తాము తప్పుగా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/Fjg2Ro6JfS — TF Videos (@TF_Video) November 24, 2022 చదవండి: FIFA WC: పాపం.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేక var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
యూపీ ఎన్నికల ఫలితాలు; వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం
మీరట్: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు యోగేశ్ వర్మ మాత్రం బైనాక్యులర్‌తో చూస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఎదుట యోగేశ్ వర్మ, ఆయన మద్దతుదారులు గస్తీ కాస్తున్నారు. బైనాక్యులర్‌తో కనిపెట్టి మరీ చూస్తున్నారు. 8 గంటల చొప్పున షిప్టులవారీగా 24 గంటలూ కాపలా కాస్తున్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సొంతంగా భద్రత ఏర్పాటు చేయడంపై యోగేశ్ వర్మను ప్రశ్నించగా.. ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల తీర్పును జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు తెలిపారు. ‘ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టూ ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని మా పార్టీ అధ్యక్షుడు (అఖిలేష్ యాదవ్) ఆదేశించారు. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు నమ్మకం లేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ’ని యోగేశ్ వర్మ అన్నారు. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?) తాజా ఎన్నికల్లో మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. కాగా, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద యోగేశ్ వర్మ ఓవరాక్షన్‌పై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. (క్లిక్: మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!) -
నో యువర్ ఆర్మీ