ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడం నిషేధంలో ఉంది. కాకపోతే స్టేడియానికి కొంత దూరంలో బయట అమ్ముకునేందుకు వీలు కల్పించారు. అయితే కొందరు అభిమానులు అధికారుల పర్మిషన్‌తో మద్యంను స్టేడియాల్లోకి తీసుకొస్తున్నారు. మద్యం తాగడం తాము తప్పబట్టమని.. కానీ తాగి స్టేడియంలో పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
కానీ ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే కాస్త ఉద్రిక్తత ఉంటుంది. ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందోననే కుతూహలంతో మందు కాస్త ఎక్కువ తాగాలనుకుంటారు. అందుకే కొందరు దొంగచాటుగా పోలీసులు, సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి మద్యం స్టేడియం లోపలికి తీసుకురావాలని చూసి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఒక అభిమాని తన బైనాక్యులర్స్‌లో బీర్‌ను తీసుకెళ్లడం అందరిని షాక్‌కు గురి చేసింది. చెకింగ్ సమయంలో సెక్యూర్టీ గార్డ్ ఆ బైనాక్యులర్స్ లెన్స్ తీశాడు.
అయితే ఆ బైనాక్యులర్‌లో ద్రవం రూపంలో ఏదో ఉన్నట్లు గుర్తించాడు. శానిటైర్ తీసుకెళ్తున్నట్లు సదరు అభిమాని చెప్పినప్పటికి అధికారులు వినలేదు. ఆ తర్వాత బైన్యాక్యులర్స్‌లో ఉన్న ద్రవాన్ని వాసన చూడగా అది అల్కాహాల్ అని తేలడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం తెచ్చుకోవడం తప్పు కాదని.. కానీ ఇలా మా కళ్లు గప్పి తేవడం తాము తప్పుగా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— TF Videos (@TF_Video) November 24, 2022
Comments
Please login to add a commentAdd a comment