Viral Video: Jharkhand Police Suspended For Drinking And Dancing At Police Station - Sakshi
Sakshi News home page

హవ్వా..! పోలీస్‌ స్టేషన్‌లోనే పోలీసుల మందు.. చిందులు.. వీడియో వైరల్‌

Published Fri, Mar 10 2023 3:05 PM | Last Updated on Fri, Mar 10 2023 9:27 PM

Video: Jharkhand Police Suspended For Drinking Dancing At Police Station - Sakshi

రాంచీ: న్యాయం కోసం వచ్చే ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఖాకీ దుస్తులు ధరించి బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు తప్పటడుగులు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ స్టేషన్‌లోనే కొందరు పోలీసులు పిచ్చి చేష్టలకు పాల్పడ్డారు. పోలీస్‌ స్టేషన్‌లో మద్యం తాగుతూ చిందులేశారు. చివరికి సదరు పోలీసులకు ఉన్నతాధికారులు ఊహించని షాక్‌ ఇచ్చారు.. ఈ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో చోటుచేసుకుంది. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. మార్చి 9వ తేదీన హోలీ సందర్భంగా కొంతమంది పోలీసులు సివిల్‌ దుస్తులు ధరించి పోలీస్‌ స్టేషన్‌ క్యాంపస్‌లో మద్యం సేవించారు. అంతటితో ఆగకుండా తాగిన మైకంలో ఒళ్లు మర్చిపోయి డ్యాన్స్‌ చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం.. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో వెంటనే చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై విచారణ జరిపినట్లు ఎస్పీ నాటు సింగ్‌ మీనా తెలిపారు. విచారణలో అధికారులు నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో అయిదుగురు పోలీసు అధికారులను విధుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సస్పెండ్‌ అయిన వారిలో ఇద్దరు ఏఎస్సైలు ముగ్గురు కానిస్టేబుల్స్‌ ఉన్నారు. ఇదే వీడియోను జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబు లాల్ మరాండీ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
చదవండి: దూకుడు పెంచిన ఈడీ.. బిహార్‌ డిప్యూటి సీఎంకు షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement