కేంద్రమంత్రి బూట్లు తీసిన ప్రభుత్వ అధికారి.. వీడియో వైరల్‌ | Video Shows Officer Removing Union Minister's Shoes Adjusting His Pyjamas, Check Out The Details | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి బూట్లు తీసిన ప్రభుత్వ అధికారి.. వీడియో వైరల్‌

Published Mon, Sep 9 2024 8:31 PM | Last Updated on Tue, Sep 10 2024 11:28 AM

Video: officer removing Union Minister's shoes adjusting his pyjamas

కేంద్రమంత్రికి ఓ ప్రభుత్వ అధికారి సేవలు చేయడం విదాదాస్పదంగా మారింది. సదరు ఉన్నతాధికారి మంత్రి పైజామాను సరిచేయడం, బూట్లను తొలగించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  దీంతో అధికారి, మంత్రి తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్‌  విమర్శలు గుప్పించింది.  

కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి సతీష్‌ చంద్ర దూబే సోమవారం జార్ఖండ్‌ పర్యటనకు వచ్చారు. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ అనుంబంధ సంస్థ అయిన బీసీసీఎల్‌ జనరల్‌ మేనేజర్‌ అరిందమ్‌ ముస్తాఫీ.. కేంద్ర మంత్రి బూట్లను తొలగించారు. అలాగే ధన్‌బాద్‌లోని భూగర్భ గని సందర్శన సమయంలో ఆయన పైజామాను సరిచేశారు.

ఈ వీడియో వైరలవ్వడంతో కాంగ్రెస్‌ స్పందిస్తూ.. ఈ ఘటన అవమానకరమైన విషయమని విమర్శించింది. బీసీసీఎల్‌ అధికారులు తమ అవినీతిని దాచడానికి ఇలాంటి చర్యల ద్వారా మంత్రులను సంతోష పెడుతున్నారని ఆరోపించింది.

‘మంత్రి కాళ్లకు షూస్ జీఎం తొలగిస్తే అది సిగ్గుచేటు. జీఎంను బీబీసీఎల్‌ సీఎండీ (చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌)గా చేయాలి. అలాంటి బీసీసీఎల్‌ అధికారులు అవినీతికి పాల్పడి, తమ లోపాలను దాచిపెట్టి మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు’ అని ధన్‌బాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ సింగ్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement