Made
-
చీకట్లోనూ స్పష్టంగా చూపిస్తుంది..
రాత్రివేళ చీకట్లో దగ్గరగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడటం సాధ్యం కాదు. చీకట్లో భూతద్దాలను ఉపయోగించినా ఫలితం ఉండదు. ఈ బైనాక్యులర్ చేతిలో ఉంటే మాత్రం చీకట్లోనూ దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. జపాన్‌కు చెందిన కెమెరాల తయారీ కంపెనీ ‘యాషికా’ ఇటీవల ఈ నైట్‌విజన్ బైనాక్యులర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని ఫిక్స్డ్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, దూరంగా ఉన్న వస్తువులు మూడురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, ఐదురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ కెమెరాల మాదిరిగానే దీనికి నాలుగు అంగుళాల హై డెఫినిషన్ డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా చీకట్లో 600 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుల రంగులను సైతం స్పష్టంగా చూడవచ్చు. ఇందులోని 512 జీబీ ఎక్స్టర్నల్ మెమరీకార్డ్‌లో చూసిన దృశ్యాలను రికార్డు చేసుకోవచ్చు. ఇది బైనాక్యులర్‌గా మాత్రమే కాకుండా, వీడియో కెమెరాగా కూడా పనిచేస్తుంది. దీని ధర 169 డాలర్లు (రూ. 14,050) మాత్రమే! ఇవి చదవండి: మొక్కల నుంచి వచ్చే సంగీతాన్ని వినొచ్చు తెలుసా! -
పండ్లను ఇనుములా మార్చి సుత్తిగా తయారుచేయొచ్చా!
ఫొటోలో కనిపిస్తున్న అరటిపండు నిజానికి ఒక సుత్తి. అలాగని అరటిపండు ఆకారంలో ఇనుముతో తయారుచేసిన సుత్తి కాదు. నిజమైన అరటిపండుతోనే రూపొందించిన సుత్తి ఇది. ఆశ్చర్యపోతున్నారా? ఈ మధ్యనే జపాన్‌కు చెందిన ‘ఐకెడా’ అనే కంపెనీ ఈ అద్భుతమైన అరటి సుత్తిని ప్రవేశపెట్టింది. సాధారణ వాతావరణంలో అరటిపండు మొత్తగా ఉంటుంది. కానీ మైనస్ డిగ్రీ సెల్సియస్ వాతవరణంలో పూర్తిగా గడ్డకట్టి .. బలమైన రాయి, సుత్తి కంటే గట్టిగా, బలంగా ఉంది. అలా ఫ్రీజ్ చేసిన అరటిపండుతో గోడకు మేకులు కొట్టే వీడియోలు ఇప్పటికే యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. దీని ఆధారంగానే ‘ఐకెడా’ గడ్డకట్టిన అరటిపండును తీసుకొని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో మెటల్ ప్రాసెసింగ్ చేసి ఈ అరటిసుత్తిని తయారుచేసింది. ఇదే విధంగా గతంలోనూ పైనాపిల్, బ్రోకలీ వంటివాటికీ మెటల్ ప్రాసెసింగ్ చేశారు. అయితే కొనుగోళ్లలో వాటన్నింటి కంటే ఈ అరటి సుత్తే టాప్‌లో నిలిచి వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇది వివిధ రకాల సైజుల్లో ధర రూ. వెయ్యి నుంచి రూ. ఆరువేల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. (చదవండి: పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?) -
ఆంటీ ల్యాప్‌టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి!
ఆంటీ తనకు ల్యాప్‌టాప్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక చిట్టి తల్లి తానే స్వయంగా ల్యాప్‌టాప్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఉదంతాన్ని నేహా అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిన్నారి కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన ‘హ్యాండ్‌మేడ్’ ల్యాప్‌టాప్ ఫొటోను నేహా షేర్ చేశారు. నేహా క్యాప్షన్‌లో ఇలా రాశారు ‘నా మేనకోడలు నన్ను ల్యాప్‌టాప్ కావాలని అడిగింది. నేను నిరాకరించడంతో, మూడు గంటల పాటు శ్రమపడి, ల్యాప్‌టాప్ తయారు చేసుకుంది’ నేహా షేర్ చేసిన ఫోటోలో ల్యాప్‌టాప్ ఆకారంలో కత్తిరించిన కార్డ్బోర్డ్ కటౌట్ కనిపిస్తుంది. దానిపై స్కెచ్ పెన్‌తో గీసిన కీబోర్టు చిహ్నాలు కనిపిస్తాయి. కాగా ఈ హోమ్మేడ్ ల్యాప్‌టాప్‌లో ‘గేమ్స్’, ‘జూమ్’, ‘లైక్’, ‘రైట్’, ‘సెలెక్ట్’ మొదలైన ఆప్షన్ బటన్లు కనిపిస్తాయి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారింది. 2,52,000కు పైగా వీక్షణలను దక్కించుకుంది. సోషల్ మీడియా యూజర్స్ ఆ చిన్నారి సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. ఒక యూజర్ ‘ఈ ల్యాప్‌టాప్ ఉత్తమమైనది. విండోస్ ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి’ అని రాశారు. మరొకరు ‘ఈ ల్యాప్ టాప్ కీబోర్డ్‌లో చాలా ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మరింత మెరుగ్గా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు! My niece asked for my laptop and i said no so she spent 3 hours making her own laptop😭 pic.twitter.com/Bb7EK7BN97 — Neha (@LadyPeraltaa) October 1, 2023 -
రీసైకిల్ ప్లాస్టిక్ తో నోకియా ఫోన్లు తయారీ
-
గుండుపిన్నుపై మట్టి గణపతి విగ్రహాన్ని తయారుచేసిన దయాకర్
-
హెలికాప్టర్ తయారుచేసి దానికే బలైన యువకుడు
-
కొత్త నోట్ల పర్సుల సంచలనం...?
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో దేశంలో కరెన్సీ సంక్షోభం ఒకవైపు కొనసాగుతుండగానే చైనా అప్పుడే రంగంలోకి దిగిపోయింది. ఆగండాగండి.. చైనా రంగంలోకి దిగిపోయింది..అంటే నకిలీ కరెన్సీతోనో.. నగదు మార్పిడికోసమో కాదు. కొత్త కరెన్సీ నోట్లకోసం ఆశగా ఎదురు చూస్తున్న భారతీయుల మనసు దోచుకునేందుకు చైనా తన మార్కెటింగ్ టెక్నిక్ ను మరోసారి బాగా వాడేసింది. దేశంలో చైనా వస్తువులను నిషేధించాలన్న వాదనలు కొనసాగుతుండగానే .. మన కొత్త రూ.500 రూ.2000 నోట్ల డిజైన్ తో పర్సులు మార్కెట్లలో దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. చవక వస్తువులతో దేశీయ వినియోగదారులను, మార్కెట్ ను కొల్లగొడుతున్న చైనా దేశీయ కొత్త కరెన్సీని పోలిన మహిళల వాలెట్స్ ను వినూత్నంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక్క పక్క దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజలు అష్ట కష్టాలుపడుతోంటే.. రూ.2000, రూ.500 నోట్లను పోలిన డిజైన్ తో వాలెట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు మనం దేశం నోట్ల ముద్రణకు ఇబ్బందులు పడుతోంటే.. చైనా మాత్రం అపుడే పర్సులను రెడీ చేసిందన్న కమెంట్లు వెల్లువెత్తాయి. కాగా రూ.500 రూ.1000 నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై పలురంగాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా... ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో పెద్దనోట్ల రద్దుపై శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. -
అడ్రస్ ఓ చోట.. తయారీ మరో చోట
- వ్యవసాయ శాఖను పక్కదోవ పట్టిస్తున్న బయో కంపెనీలు - ఆదోని కిసాన్ మాల్ భారీగా అక్రమాలు - 2112 లీటర్లపై స్టాప్‌సేల్స్ కర్నూలు(అగ్రికల్చర్): పేరు ఒక ప్రాంతంలో... తయారీ మరో సుదూర ప్రాంతంలో.. ఇది బయో పెస్టిసైడ్స్, బయో ఫర్టీలైజర్ కంపెనీల తీరు ఇది. గుర్తింపు ఉన్న కంపెనీలే తప్పుడు అడ్రస్‌లతో వ్యవసాయ శాఖను పక్కదోవ పట్టిస్తున్నాయి. బయో కంపెనీలు ఇచ్చిన అడ్రస్‌ల ప్రకారం వెళ్తే అక్కడ వాటి జాడ లభించలేదు. అధికారికంగా జిల్లాలో 13 బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, అడ్రస్ లేని దొంగ కంపెనీలు వందల్లో ఉన్నాయి. బయో వ్యాపారంలో వ్యవసాయాధికారులే మునిగి తేలుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. వేర్వేరు జిల్లాలకు చెందిన డీడీఏ, ఏడీఏ, ఏఓ స్థాయి అధికారులను స్క్వాడ్‌గా ఏర్పాటు చేసి జిల్లాలో బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలను తనిఖీలకు చర్యలు తీసుకున్నారు. బుధ, గురు వారాల్లో ఏడు తయారీ కేంద్రాలకు ఆయా కంపెనీలు ఇచ్చిన అడ్రస్‌ల ప్రకారం వెళ్లి తనిఖీ చేశారు. ఇందులో నాలుగు బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఇచ్చిన అడ్రస్‌లో లేవు. హైదరాబాద్, తదితర నగరాల్లో తయారు చేసి నేరుగా జిల్లాలోని గ్రామాలకు తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వ్యవసాయశాఖను తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు అడ్రస్‌లు ఇచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కల్లూరు మండలం బస్తిపాడు అడ్రస్‌తో ఉన్న పద్మజ క్రాప్ సైన్స్, కర్నూలు మండలం దిన్నెదేవరపాడులోని గోశాల దగ్గర అడ్రస్‌తో పవన్‌పుత్ర అగ్రి లైప్ సైన్సెస్, దిన్నెదేవరపాడులోని ఇండియన్ క్రాఫ్ కేర్, బేతంచెర్లలోని ఏఎస్ రామమూర్తి బయో కంపెనీలు వారు ఇచ్చిన అడ్రస్‌లో, పరిసరాల్లోనూ లేనట్లు స్పష్టమైంది. ఆదోనిలో కిసాన్ మాల్ పేరుతో బయో కంపెనీ ఉన్నా పలు అక్రమాలు వెలుగు చూశాయి. బయోల వివరాలు స్టాక్ రిజిస్ర్టర్లో చూపకపోవడం తదితర కారణాలతో రూ.1.56 లక్షల విలువ కలిగిని 2112 లీటర్ల బయో మందుల అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ సందర్భంగా స్క్వాడ్ డీడీఏ మోహన్‌రావు సాక్షితో మాట్లాడుతూ బయోపెస్టిసైడ్ కంపెనీలు విధిగా కోర్టు స్టే ఆర్డర్ కలిగి ఉండాలని, ఆ మేరకు పత్రాలు, ఇన్వాయిస్ వివరాలు, స్టాక్ రిజిస్ర్టర్ తదితర వన్నీ ఉండాలని వివరించారు. తనిఖీలతో పాటు శ్యాంపుల్స్ కూడా సేకరించి ల్యాబ్‌కు పంపుతామని ఇందులో కెమికల్స్ ఉన్నాయని నిర్ధారణ అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇంకా ఆరు కంపెనీలను తనిఖీ చేయాల్సి ఉందన్నారు. -
'అమ్మా' రక్షించు.. శివశంకర్ మాస్టర్ విన్నపాలు!
చెన్నై: తెలుగు ప్రేక్షకులకు శివశంకర్ మాస్టర్ గా సుపరిచితమైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్... శివశంకర్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రూపంలో విన్నపాలను పంపారు. తమ కుటుంబానికి ఆత్మ హత్య చేసుకోవడం తప్పించి మరో దారి లేదని, తమ కేసును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రయత్నం చేయాలంటూ ఆయన తన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనదైన శైలిలో.. ప్రత్యేక అభినయంతో.. సూపర్ ఛాలెంజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివశంకర్ ప్రసాద్ కష్టాల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు విజయ కృష్ణ ప్రసాద్ తో భార్య జ్యోతి... విడాకులు తీసుకున్నప్పటికీ తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆయన అమ్మకు (తమిళనాడు సీఎం జయలలిత) రాసిన ఉత్తరంలో తన గోడును వెళ్ళబోసుకున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని మరీ తమను ఏడిపించాలని చూస్తోందని, పది కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతోపాటు, తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి ఇంటిని లాక్కోవాలని చూస్తోందంటూ జయలలితకు శివశంకర్ ప్రసాద్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2013 సంవత్సరంలో శివశంకర్ మాస్టారి కుమారుడు విజయశంకర్ ప్రసాద్ బెంగళూరుకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్యా వచ్చిన విభేదాలతో డైవర్స్ తీసుకున్నారు. అయితే అప్పట్నుంచీ శివశంకర్ మాస్టారి కుటుంబాన్ని పలు రకాలుగా వేధిస్తున్న జ్యోతి... తాజాగా వారిపై కేసు పెట్టింది. ఇటీవల తమ ఇంటిముందు ఆందోళనకు దిగి పదికోట్ల డబ్బును డిమాండ్ చేసిందని, ఆమె టార్చర్ భరించలేక తమ కుటుంబం కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని శివశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమ కుటుంబంపై అక్రమ కేసును బనాయించిందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవడం తప్ప మరోదారి లేదని తెలిపారు. మరి మాస్టారి విషయంలో అమ్మ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
జైలు నుంచి యాసిన్ భత్కల్ ఫోన్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం తీహార్ జైలు లో ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎమ్) చీఫ్ యాసిన్ భత్కల్ ను ఐఎస్ఐఎస్, అనసర్ ఉద్-తవ్హీద్ ఫీ బిలాద్ అల్ హింద్(ఏయుటీ) సంస్థలకు చెందిన నేతలు కలిశారా? అనే వార్తలకు అవుననే! సమాధానం వినిపిస్తోంది. జైలు నుంచి భత్కల్ తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. గత జూన్ లో తన భార్యతో మాట్లాడిన భత్కల్ త్వరలో దామస్కస్ నుంచి సాయం అందుతుని చెప్పినట్లు భారత ఐసిస్ రిక్రూటర్ లుగా ఉన్న ఆషీక్ అహ్మద్ అలియాస్ రాజా, మహ్మద్ అబ్దుల్ అహద్, మహమ్మద్ అఫ్జల్ లు తెలిపారు. దీంతో అలర్ట్ అయిన ఇంటిలిజెన్స్ అధికారులు భత్కల్ అరెస్టు తర్వాత ఇప్పటివరకు అతన్ని కలిసిన వారిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. -
బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్!!
లండన్: ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పటికప్పుడు తమ సృజనకు పదును పెట్టి కొత్త కోణాల్లో ట్రెండ్ సెట్ చేసేందుకు చూస్తుంటారు. అయితే లండన్ కు చెందిన ఆ కేక్ డిజైనర్ మాత్రం తన సృజనతో ఓ బ్యూటిఫుల్ వెడ్డింగ్ కేక్ డ్రెస్ ను రూపొందించి ఔరా అనిపించుకొంది. ఆ డిజైనర్ డ్రెస్ ను చూసి తరించడమే కాదు... కొరికి... రుచి కూడా చూడొచ్చన్నమాట..! లండన్ కు చెందిన కేక్ డిజైనర్ సిల్వియా ఎల్బా... కొత్త కోణంలో వెడ్డింగ్ డ్రెస్ ను రూపొందించింది. విభిన్న డిజైన్లను సృష్టించడంలో మేటిగా పేరొందిన డిజైనర్ ఈసారి కాస్త భిన్నంగా ఆలోచించింది. ఫన్ అండ్ ఫంకీ కేక్ స్థాపకుడు ఎట్టె మ్యానర్ తో పాటు కళాకారుడు లింకా రింక్ లతో కలిసి తన కలను సాకారం చేసుకుంది. సుమారు రెండు మీటర్ల పొడవు, 70 కేజీల బరువైన కేక్ తో 'ద వెడ్డిబుల్ డ్రెస్' పేరిట కొత్తరకం గౌనుకు రూపకల్పన చేసింది. ఎల్బా బృందం.. సృష్టించిన ఈ వినూత్న వెడ్డింగ్ డ్రెస్ రూపొందించేందుకు 300 గంటలు పట్టిందట. అంటే సుమారు పన్నెండు రోజులపాటు కష్టించి ఈ పెళ్ళి గౌనును తయారు చేసిన డిజైనర్లు... దీనికి 35 కేజీల ఫాండెంట్ ప్లస్ ను, వేఫర్ పేపర్ షీట్లతో తయారైన 15,000 రఫుల్స్ ను వినియోగించారట. అంతేకాక వెండిరంగు పూసలను అద్ది.. మిరుమిట్లు గొలిపే డిజైనర్ కేక్ డ్రెస్ ను రూపొందించారు. ఇంత కష్టపడి ఈ కేక్ ను ఏ పెళ్ళికూతురుకోసం రూపొందించారో అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే... ఈ వారాంతంలో లండన్ లో జరగబోయే కేక్ ఇంటర్నేషనల్ షోలో ప్రదర్శనకోసం డిజైనర్లు ఇలా ప్రత్యేక శైలిని ప్రయోగించారన్నమాట. -
వినికిడిశక్తి లేని డ్రైవర్లకు కొత్త యాప్..!
ఉబెర్ సంస్థ ఇప్పుడు ఓ కొత్త యాప్ ను అభివృద్ధి పరచింది. ముంబైలోని ఓ వినికిడి శక్తి లేని డ్రైవర్ ఇబ్బందులను గమనించిన సంస్థ.. ఈ కొత్త అనువర్తనాన్ని భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. పుట్టుకతోనే చెవుడు, ఎంతోమంది వినికిడి శక్తి లేని వారికి అనుకూలంగా ఉండేట్టు ఈ కొత్త యాప్ రూపొందించింది. ఇప్పటికే లాస్ ఏంజిల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్ టన్ డిసి లలో ట్యాక్సీలకోసం సృష్టించిన ఈ 'హైలింగ్ యాప్' ను అభివృద్ధి పరచి భారత్ లో ప్రవేశ పెట్టింది. ఇతర దేశాల్లో ఇప్పటికే 'ట్యాక్సీ హైలింగ్' యాప్ వాడకంలో ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే భారత్ లో దీని అభివృద్ధిని ఇప్పుడు ధృవీకరించారు. యాప్ లోని ఈ కొత్త ఫీచర్ ను వాడే డ్రైవర్.. యాప్ ఆన్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది. వినియోగదారులనుంచి కాల్ వచ్చినపుడు యాప్ లోఆడియోకి బదులుగా లైట్ ఫ్లాష్ అవుతుంటుంది. ఈ యాప్ లో ప్యాసింజెంర్లు డ్రైవర్ కు ఫోన్ చేసే అవకాశం ఉండదు. వినికిడి శక్తి లేనివారికోసం రూపొందించిన ఈ అనువర్తనంలోని కాల్ ఆప్షన్ కు బదులుగా టెక్స్ట్ ఆప్షన్ ను ప్రవేశ పెట్టారు. దీంతో ప్రయాణీకులు పికప్ ప్రాంతాన్నిటెక్స్ మెసేజ్ ద్వారా తెలిపే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇందులో ఏర్పాటు చేసిన అధిక స్క్రీన్ ద్వారా ప్యాసింజర్లు చేరాల్సిన ప్రాంతాన్ని టెక్స్ట్ మెసేజ్ ద్వారా సూచించాల్సి ఉంటుంది. ట్యాక్సీ హైలింగ్ యాప్ లోని ఈ కొత్త ఫీచర్.. భారతదేశంలోని వినికిడి శక్తి లేని డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉంటుందని, మరింత అవకాశాలను తెచ్చిపెట్టగలదని భావిస్తున్నట్లు ఉబెర్ ప్రొడెక్ట్ ఇన్నోవేషన్ మేనేజర్ బెన్ మెట్కఫె తన బ్లాగ్ లో రాశారు. డ్రైవర్లందరికీ ఒకేరకమైన శిక్షణ ఉంటుందని, అయితే వినికిడి శక్తి తక్కువ ఉన్నవారికి కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని అంటున్నారు. అందుకోసం ప్రత్యేక శిక్షణాధికారులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ఉబెర్ సంస్థ ప్రతినిధి చెప్తున్నారు. వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 నుంచి 300 మిలియన్ల చెవిటివారు ఉన్నారని, వారిలో 66 శాతంమంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అందులో ఇండియాలో అధికభాగం ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు డెఫ్ డ్రైవర్లు చాలా తక్కువమంది ముందుకు వచ్చారని ఉబెర్ ప్రతినిధి చెప్తున్నారు. ముందు ముందు తమ ప్రయత్నం అత్యంత ఉపయోగకరంగా మారుతుందని వారు భావిస్తున్నారు. -
వివాహం విషయంలో మూడు ప్రాంతాలవారికి పట్టింపులు