బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్!! | Beautiful wedding dress is completely made of cake | Sakshi
Sakshi News home page

బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్!!

Published Tue, Apr 12 2016 6:52 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్!!

బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్!!

లండన్: ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పటికప్పుడు తమ సృజనకు పదును పెట్టి కొత్త కోణాల్లో ట్రెండ్ సెట్ చేసేందుకు చూస్తుంటారు. అయితే  లండన్ కు చెందిన ఆ కేక్ డిజైనర్ మాత్రం తన సృజనతో ఓ బ్యూటిఫుల్ వెడ్డింగ్ కేక్ డ్రెస్ ను రూపొందించి ఔరా అనిపించుకొంది. ఆ డిజైనర్ డ్రెస్ ను చూసి తరించడమే కాదు... కొరికి... రుచి కూడా చూడొచ్చన్నమాట..!
 
లండన్ కు చెందిన కేక్ డిజైనర్ సిల్వియా ఎల్బా... కొత్త కోణంలో వెడ్డింగ్ డ్రెస్ ను రూపొందించింది. విభిన్న డిజైన్లను  సృష్టించడంలో మేటిగా పేరొందిన డిజైనర్ ఈసారి కాస్త భిన్నంగా ఆలోచించింది. ఫన్ అండ్ ఫంకీ కేక్ స్థాపకుడు ఎట్టె మ్యానర్ తో పాటు కళాకారుడు లింకా రింక్ లతో కలిసి తన కలను సాకారం చేసుకుంది. సుమారు రెండు మీటర్ల పొడవు, 70 కేజీల బరువైన కేక్ తో 'ద వెడ్డిబుల్ డ్రెస్' పేరిట కొత్తరకం గౌనుకు రూపకల్పన చేసింది.

ఎల్బా బృందం.. సృష్టించిన ఈ వినూత్న వెడ్డింగ్ డ్రెస్ రూపొందించేందుకు 300 గంటలు పట్టిందట.  అంటే సుమారు పన్నెండు రోజులపాటు కష్టించి ఈ పెళ్ళి గౌనును తయారు చేసిన డిజైనర్లు... దీనికి 35 కేజీల ఫాండెంట్ ప్లస్ ను, వేఫర్ పేపర్ షీట్లతో తయారైన 15,000 రఫుల్స్ ను వినియోగించారట. అంతేకాక వెండిరంగు పూసలను అద్ది..  మిరుమిట్లు గొలిపే డిజైనర్ కేక్ డ్రెస్ ను రూపొందించారు. ఇంత కష్టపడి ఈ కేక్ ను ఏ పెళ్ళికూతురుకోసం రూపొందించారో అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే... ఈ వారాంతంలో లండన్ లో జరగబోయే కేక్ ఇంటర్నేషనల్ షోలో ప్రదర్శనకోసం డిజైనర్లు ఇలా ప్రత్యేక శైలిని ప్రయోగించారన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement