ఫొటోలో కనిపిస్తున్న అరటిపండు నిజానికి ఒక సుత్తి. అలాగని అరటిపండు ఆకారంలో ఇనుముతో తయారుచేసిన సుత్తి కాదు. నిజమైన అరటిపండుతోనే రూపొందించిన సుత్తి ఇది. ఆశ్చర్యపోతున్నారా? ఈ మధ్యనే జపాన్‌కు చెందిన ‘ఐకెడా’ అనే కంపెనీ ఈ అద్భుతమైన అరటి సుత్తిని ప్రవేశపెట్టింది. సాధారణ వాతావరణంలో అరటిపండు మొత్తగా ఉంటుంది. కానీ మైనస్ డిగ్రీ సెల్సియస్ వాతవరణంలో పూర్తిగా గడ్డకట్టి .. బలమైన రాయి, సుత్తి కంటే గట్టిగా, బలంగా ఉంది.
అలా ఫ్రీజ్ చేసిన అరటిపండుతో గోడకు మేకులు కొట్టే వీడియోలు ఇప్పటికే యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. దీని ఆధారంగానే ‘ఐకెడా’ గడ్డకట్టిన అరటిపండును తీసుకొని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో మెటల్ ప్రాసెసింగ్ చేసి ఈ అరటిసుత్తిని తయారుచేసింది. ఇదే విధంగా గతంలోనూ పైనాపిల్, బ్రోకలీ వంటివాటికీ మెటల్ ప్రాసెసింగ్ చేశారు. అయితే కొనుగోళ్లలో వాటన్నింటి కంటే ఈ అరటి సుత్తే టాప్‌లో నిలిచి వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇది వివిధ రకాల సైజుల్లో ధర రూ. వెయ్యి నుంచి రూ. ఆరువేల వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
(చదవండి: పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment