‘చలి-పులి’కి ఎవరైనా ఒక్కటే. మాన్యులు..సామాన్యులు అనే తేడా ఉండదు..చిన్నా పెద్దా అనే తారతమ్యం అంతకంటే ఉండదు. శీతాకాలం ఆరంభంలో గిలిగింతలు పెట్టిన చలిపులి రానురాను వణుకు పుట్టిస్తోంది. రాత్రిళ్లు రోడ్డుపైకి రావాలంటేనే గజగజలాడే పరిస్థితి ఏర్పడింది. ఉధృతమవుతున్న చలిగాలులకు కాళ్లు చేతులు కొంగర్లు పోతున్నాయి. ఇళ్ల కిటికీలు, తలుపులను తోసుకువస్తున్న చలిపులికి అంతా ఠారెత్తుతున్నారు. రాత్రిళ్లు దుప్పట్లు, రగ్గుల్లో ముసుగు తన్ని నిద్రిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థుల ‘చలి-బాధలు’ తెలుసుకునేందుకు ‘సాక్షి’ చిరు ప్రయత్నం చేసింది. జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ వసతి గృహాలను మంగళవారం రాత్రి సందర్శించింది. విద్యార్థుల కష్టాలను కళ్లారా చూసింది. పడుకునేందుకు కనీసం చాపలు కూడా లేని పరిస్థితి.. గదుల్లో గచ్చుపైనే నిద్ర.. చలికి ఈకవ తీసిన బండలపై పల్చటి దుప్పటి పరుచుకుని, మరో పల్చటి దుప్పటి కప్పుకుని నిద్రించాల్సిన దుస్థితి. కొన్ని చోట్ల దుప్పట్లు కూడా లేక ఇక్కట్లు పడుతున్న విద్యార్థులు... రెక్కలు లేని కిటికీలు స్వేచ్ఛగా చలిగాలులను స్వాగతిస్తుంటే లోపల గజగజ వణకుతున్న విద్యార్థులే అన్ని చోట్లా కనిపించారు.
విద్యార్థులు గజ..గజ !
Published Thu, Dec 4 2014 2:23 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement