
భోపాల్: భూతగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని దుండగులు అతికిరాతకంగా కొట్టి చంపారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న దృశ్యాలు కొందరు మొబైల్‌లో చిత్రీకరించగా.. దీన్నీ చూసిన నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు. రఈ ఘోర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఉజ్జాయిని జిల్లాలో పశువుల మేతకు సంబంధించిన భూ వివాదంలో 26 ఏళ్ల గోవింద్ అనే యువకుడిని అయిదుగురు దుండగులు కర్రలతో దాడికి తెగబడ్డారు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లే వరకు అతన్ని చితకబాదుతూనే ఉన్నారు. అయితే నడిరోడ్డుమీదే ఇంత దారుణం జరుగుతున్నా ఎవరూ ఆపకపోవడం బాధకరం
ఈ దృశ్యాలన్నీ మొబైల్‌లో రికార్డయ్యాయి. ఇందులో గోవింద్ రోడ్డు మీద పడుకున్నట్లు చూపిస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. వారిలో ఒకరు అతని భుజాలు పట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నిస్తుండగా అతను కదలటం లేదు. తీవ్రంగా కొట్టి, తన్నిన అనంతరం అతన్ని బైక్‌పై తీసుకుళ్లి వాళ్ల ఇంటి ముందు పడేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ ఇండోర్‌లోని మరో పెద్ద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
కాగా గోవింద్‌కు పశువుల పెంపకం, మేత కోసం భూమి విషయంలో కొంతమందితో చాలాకాలంగా వివాదంలో ఉన్నాడు. ఈ విషయంపై కూర్చొని సమస్యను పరిష్కరించుకుందామని నిందితుల్లో గోవింద్‌ను తన ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారని గోవింద్ స్నేహితుడు సూరజ్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుల్లోని అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి:
అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి
తల్లిదండ్రులను మత్తులోకి పంపించి.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే..
Comments
Please login to add a commentAdd a comment