రాయ్పూర్: కులం తక్కువవాడివి తమను ప్రశ్నించే ధైర్యమా నీకు అంటూ విద్యుత్ శాఖ అధికారులు అతడిని కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు తరలించడంతో అక్కడ కూడా పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్ల ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చత్తీస్గఢ్ లోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సతీశ్ కుమార్ నోర్గ్ అనే ఓ గిరిజన యువకుడు ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంపై విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించాడు.
ఈ క్రమంలో వారు అతడితో గొడవపడ్డారు. అనంతరం అతడిపై చేయి చేసుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు లాకప్ లో దారుణంగా కొట్టడంతో ఆ దెబ్బలకు మృత్యువాత పడ్డాయి. ఈ విషయం కాస్త బయటకు తెలిసి వివాదం రాజుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ కులస్తులన్నా, గిరిజనులన్నా ఏమీ పట్టకుండా పోయిందని వారికి రక్షణ కల్పించడం మానేసిందని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నేత భూపేశ్ బాగేల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కులకు కూడా ఓ లేఖ ద్వారా తెలియజేయనున్నట్లు తెలిపారు.
ఇదేమిటని ప్రశ్నించినందుకు రాక్షసుల్లా మారి..
Published Sun, Sep 18 2016 2:55 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement
Advertisement