రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దారుణం చోటు చేసుకుంది. బెయిల్‌పై విడుదలైన ఓ రౌడీ షీటర్.. సూరజ్‌పూర్ జిల్లాలోని మార్కెట్ ఏరియాలో ఓ కానిస్టేబుల్‌పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంటిలోకి చొరబడ్డాడు. హెడ కానిస్టేబుల్ భార్య, మైనర్ కుమార్తెను హత్యచేశారు.
సూరజ్‌పూర్ ఎస్పీ ఎంఆర్ అహిరే తెలిపిన వివారాల ప్రకారం.. ‘‘హత్య, దోపిడీ కేసుల్లో నిందితుడైన హిస్టరీ-షీటర్ కుల్దీప్ సాహు. ఆదివారం సాయంత్రం మార్కెట్ ప్రాంతంలో కానిస్టేబుల్ ఘన్‌శ్యాం సోన్వానీతో వాగ్వాదానికి దిగాడు. అక్కడితో ఆగకుండా ఆ కానిస్టేబుల్‌పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశాడు. సోన్వానీకి కాలిన గాయాలయ్యాయి. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. తర్వాత నిందితుడు దుర్గా ఊరేగింపులో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ తాలిబ్ షేక్ ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆయన మైనర్ కుమార్తె , భార్యను హత్య చేశాడు. షేక్ తన ఇంటికి అర్థరాత్రి చేరుకొని చూడగా.. ఇంట్లో దోపిడి జరిగినట్లు, భార్య, కుమార్తె మృతి చెంది కనిపించారు. దీంతో తాలిబ్ పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సోమవారం ఉదయం పిధా గ్రామంలో పోలీసులు మహిళ హెడ్ కానిస్టేబుల్ కుమార్తె, భార్య మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు’’ అని తెలిపారు.
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. సూరజ్‌పూర్ పట్టణంలోని హెడ్ కానిస్టేబుల్ భార్య, కుమార్తె హత్యలను నిరసిస్తూ నిందితుడు సాహు నివాసం, బయట ఉన్న వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టారు. ఈ హత్య ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment