బ్రెజిల్‌లో ఒంగోలు ఆవు రూ. 14.86 కోట్లు!
బ్రెజిల్ దేశంలో పశుపోషకులు గిర్, ఒంగోలు తదితర భారతీయ జాతుల ఆవులు, గిత్తలను అత్యంత శ్రద్ధాసక్తులతో పెంచి పోషిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ఒంగోలు వంటి దేశీ ఆవులు, గిత్తల ధర కూడా ఔరా అనిపించేలా ఉంటుంది.
అక్టోబర్ 28వ తేదీన బ్రెజిల్ సావో పాలోని ఇండియాటుబలో జరిగిన వేలంలో పర్ల ఐవీఎఫ్ ఏజేజే అనే పేరుగల ఒంగోలు ఆవు రూ.14.86 కోట్ల (72 లక్షల బ్రెజిలియన్ రియళ్ల)కు అమ్ముడుపోయింది! బ్రెజిల్‌లో భారతీయ సంతతి ఆవుకు ఇంతకుముందెన్నడూ ఇంత అధిక ధర పలకలేదట!