హైదరాబాద్, సాక్షి: అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం చాలా ప్రమాదకరమని అంటున్నారు తెలంగాణ మంత్రి సీతక్క. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగుల కోటా కామెంట్లపై నెలకొన్న వివాదంపై మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీతక్క తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘‘అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరం. అంతా అవగాహన ఉందని మాట్లాడే వాళ్లు.. ఇతరుల అభిప్రాయలు గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. అది వాళ్ల మానసిక వైకల్యం. ఐపీఎస్‌కు ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరం. పోలీసులకు కలెక్టర్లకు తేడా తెలియదా?..
.. ఒక అధికారిగా ఉండి ఆమె అలా మాట్లాడడం తప్పు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా’’.. అని మంత్రి సీతక్క అన్నారు.
సాక్షితో స్మితా సబర్వాల్
ఇదిలా ఉంటే.. తన ఎక్స్ పోస్ట్ వివాదం కావడంతో ఆమె నిన్న దానికి వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారామె. ఆపై వివాదం మరింత ముదిరింది. ఆమెపై ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ పీఎస్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా ఆమె సాక్షి టీవీ తో ఫోన్ లైన్‌లోనూ మాట్లాడారు. ‘‘నేను ఎవరినో కించపరచడానికో లేదంటే కాంట్రవర్సీ కోసమో ఆ వ్యాఖ్యలు చెయ్యలేదు. యూపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం నుంచి సీనియర్, ఫీల్డ్ వర్క్ చేసిన అధికారుల అభిప్రాయం తీసుకుంటుంది. రిజర్వేషన్ల అంశంలో నేను నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాను.. అని అంటున్నారామె.
Comments
Please login to add a commentAdd a comment