Handicaps quota
-
బుద్ధి వైకల్యం ప్రమాదకరం.. స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం చాలా ప్రమాదకరమని అంటున్నారు తెలంగాణ మంత్రి సీతక్క. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగుల కోటా కామెంట్లపై నెలకొన్న వివాదంపై మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీతక్క తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరం. అంతా అవగాహన ఉందని మాట్లాడే వాళ్లు.. ఇతరుల అభిప్రాయలు గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. అది వాళ్ల మానసిక వైకల్యం. ఐపీఎస్‌కు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. పోలీసులకు కలెక్టర్లకు తేడా తెలియదా?.... ఒక అధికారిగా ఉండి ఆమె అలా మాట్లాడడం తప్పు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా’’.. అని మంత్రి సీతక్క అన్నారు.సాక్షితో స్మితా సబర్వాల్ఇదిలా ఉంటే.. తన ఎక్స్ పోస్ట్ వివాదం కావడంతో ఆమె నిన్న దానికి వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారామె. ఆపై వివాదం మరింత ముదిరింది. ఆమెపై ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ పీఎస్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా ఆమె సాక్షి టీవీ తో ఫోన్ లైన్లోనూ మాట్లాడారు. ‘‘నేను ఎవరినో కించపరచడానికో లేదంటే కాంట్రవర్సీ కోసమో ఆ వ్యాఖ్యలు చెయ్యలేదు. యూపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం నుంచి సీనియర్, ఫీల్డ్ వర్క్ చేసిన అధికారుల అభిప్రాయం తీసుకుంటుంది. రిజర్వేషన్ల అంశంలో నేను నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాను.. అని అంటున్నారామె. -
సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5% కోటా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం కేటాయిస్తున్నట్లు మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని.. ఉద్యోగ, విద్యావకాశాల్లో 3 శాతమున్న రిజర్వేషన్లను 4 శాతానికి పెంచిందని గుర్తుచేశారు. ఆదివారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికలాంగ విద్యార్థులకు వాహనాలు, యంత్రాలు అందించేందుకు ప్రభుత్వం అపరిమితంగా నిధులు ఖర్చు చేస్తోందని చెప్పారు. వికలాంగుల పెళ్లి ప్రోత్సాహక నిధులకు రూ.10 కోట్లు విడుదల చేశామని, జిల్లాల వారీగా వాటిని పంపిణీ చేశామని, త్వరలో లబ్ధిదారులకు చేరవేస్తామని వెల్లడించారు. దివ్యాంగుల సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పనకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఐటీ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం మామిడిపల్లిలో పదెకరాల స్థలం కేటాయించామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమంలో భాగంగా తనవంతు సహాయంగా రూ.15 లక్షలు ఆ శాఖకు అందించానని.. వికలాంగులకు డిజిటల్ లైబ్రరీ, బ్రెయిలీ యంత్రాల కోసం వాటిని ఖర్చు చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వికలాంగులకు రూ.1,500 పెన్షన్ ఇస్తున్నామని, వికలాంగుల సమస్యలను ఆలకించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. హెచ్ఎంఆర్ ఎండీకి సత్కారం వికలాంగుల మనసు నిర్మలమైనదని, కల్మషం లేకుండా కలివిడిగా ఉంటారని సినీనటి జీవిత అన్నారు. వికలాంగుల సమస్యలు, వారి మేధస్సు తెలిపేందుకు పలు చిత్రాల్లో వారి క్యారెక్టర్‌కు ప్రాధాన్యమిచ్చానని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. అనంతరం వికలాంగుల కోసం కృషి చేసిన సంస్థలు, ఉద్యోగులకు అవార్డులు అందించారు. మెట్రో రైళ్లో వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకుగాను హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని మంత్రులు సత్కరించారు. కాగా, ఉత్సవాలకు భారీగా వికలాంగులు హాజరుకావడంతో కొంత గందరగోళం నెలకొంది. జనాభాకు తగినట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో కొందరు నిరసన వ్యక్తం చేశారు. అయితే అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, ఆ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, కమిషనర్ బి.శైలజ తదితరులు పాల్గొన్నారు. -
అవిటివాడిని.. ఆదుకోండి
సంగారెడ్డి అర్బన్ : ‘బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి అక్కడ కాలు విరిగిం ది. వడ్డెర వృత్తిలో భాగంగా రాళ్లు కొడుతున్న క్రమంలో ఓ కన్ను పోయింది. అవిటివాడినైన నన్ను ఆదుకోండి’ అని గ్రీవెన్స్‌డేలో సోమవారం కొల్చారం మండల కేంద్రానికి చెందిన హనుమంతు జేసీ శరత్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధితాధికారులకు ఫిర్యాదులను అందజేశారు. ⇒ వికలాంగుల కోటా కింద రెండేళ్ల క్రితం డీలర్ షిప్ మంజూరైన తహశీల్దార్ అనుమతి ఇవ్వడం లేదని అందోల్ మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ జేసీకి ఫిర్యాదు చేశాడు. ⇒ మినీ డెయిరీ కోసం బీసీ కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకున్నా.. ఎన్నికల కోడ్ పేరుతో పెండింగ్ పెట్టారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన సాయిమాల కోరారు. ⇒ సంగారెడ్డి పట్టణంలోని 2-6-126 ఇంటి నంబర్ గల ఆస్తి పన్ను రికార్డును మార్పులు చేశారని, ఈ విషయమై మున్సిపల్ అధికారులు సమాచారం ఇవ్వాలని కోరగా నిరాకరిస్తున్నారని, పూర్తి వివరాలు అందించాలని పుల్కల్ మండలం చక్రియాల్ గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి కోరారు. ⇒ బ్యాంక్ వారు కారె ్పంట్ దుకాణాల కోసం రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న.. ఆరు నెలలుగా వికలాంగ శాఖ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని, వికలాంగుడనైన తనకు అర్హత ఉన్న అధికారులు అడ్డుకుంటున్నారని వెంటనే రుణం మంజూరు చేయాలని కోరారు. ⇒ మనూరు మండలం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన వికలాంగుడినైన విఠల్ తాను సంగారెడ్డిలోని ఆంధ్రాబ్యాంక్‌లో ట్రై వెహికిల్ నిమిత్తమై రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా.. మేనేజర్ స్పందించడం లేదని, రుణం మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ⇒ ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కరించేందు బోల్ వెల్ మంజూరు చేయాలని మునిపల్లి మండలం కంకోల్ గ్రామస్తులు జేసీని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో దయానంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.