అంబరాన్నంటిన సంబరాలు | telangana celebrations in sangareddy | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన సంబరాలు

Published Mon, Jun 2 2014 11:57 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

అంబరాన్నంటిన సంబరాలు - Sakshi

అంబరాన్నంటిన సంబరాలు

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్ : నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన శుభవేళ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో వేడుకలు అంబరాన్నంటాయి. సంగారెడ్డిలో ని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో అధికారిక వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అ ద్దంపట్టే రీతిలో అధికారులు ఆవిర్భావ వేడుకలు నిర్వహిం చారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ జాతీయజెండాను ఎగురవే సి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

అనంతరం తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని స్వేచ్ఛ కు చిహ్నమైన పావురాళ్లను నింగిలోకి ఎగురవేశారు. రంగురంగుల పూలతో తీర్చిదిద్దన బతుకమ్మలతో వేడులకు తరలివచ్చిన మహిళలు...తెలంగాణతల్లి వేషధారణలో ఉన్న చిన్నారి వద్ద బతుకమ్మలను ఉంచి బతుకమ్మ ఆడా రు. అనంతరం మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహిం చారు. డప్పువాయిద్యాలు, పోతరాజుల నృత్యాలతో బోనాలు ఊరేగింపు కన్నులపండువగా సాగింది. పేరిణీ శివతాండవం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెదక్‌లోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ‘బతుకమ్మ..బతుకమ్మ..ఉయ్యాలో’ అంటూ ఆడిపాడారు. సదాశివపేట మండలం నందికంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ జానపద గేయంపై ఓ నృత్యరూపకాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఆతర్వాత పటాన్‌చెరుకు చెందిన శివసాయి హై స్కూల్ విద్యార్థుల కళారూపం కూడా ఆహూతులను అలరింపజేసింది. ‘జయజయహే తెలంగాణ...జననీ జయకేతనం’ అంటూ సంగారెడ్డి మండం ఇస్మాయిల్‌ఖాన్‌పేట విద్యార్థులు నృత్యప్రదర్శన అహూతులను విశేషంగా ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను కలెక్టర్ స్మితా సబర్వాల్, జేసీ శరత్, డీఈఓ రాజేశ్వర్‌రావు అభినందించి జ్ఞాపికలను అందజేశారు.

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఎంపిక చేసిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశాయి. 1948 మంది లబ్ధిదారులకు రూ.22.71 కోట్లు విలువ చేసే ఆస్తులను కలెక్టర్ స్మితా సబర్వాల్ అందజేశారు. డీఆర్‌డీఏ ద్వారా 762 ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.21.50 లక్షల చెక్కులు అందించారు. మెప్మా ద్వారా ఎంపికై 54 మంది లబ్ధిదారులకు కలెక్టర్ రూ.2.16 లక్షల విలువ చేసే 54 కుట్టుమిషన్‌లు అందజేశారు. అలాగే ఏడు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.16.50 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా రూ.29.34 లక్షల విలువ చేసే వినికిడి యంత్రాలను 489 మంది విద్యార్థులకు కలెక్టర్ అందించారు. అలాగే అంధుల కోసం 69 బ్రెయిలీ కిట్స్ పంపిణీ చేశారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా 500 మందికి హెల్త్‌కార్డులు అందించారు. వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా ఆదర్శ వివాహం చేసుకున్న వారికి రూ.7.50 లక్షల ప్రోత్సాహక నగదును కలెక్టర్ పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఎంపిక చేసిన 52 మంది లబ్ధిదారులకు ఆటోలు ఇతర యూనిట్స్ కలెక్టర్ స్మితా సబర్వాల్ అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement