సిద్దిపేట అర్బన్,న్యూస్‌లైన్: మహిళలకు కాన్పు పునర్జాన్మలాంటిదంటారు. ప్రసవ వేదనతో ఉన్న గర్భిణులకు సిద్దిపేట మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి (ఎంసీహెచ్)లోని హైరిస్క్ (సీమాంక్) కేంద్రం ద్వారా వైద్యులు విశిష్ట సేవలనందిస్తున్నారు. కాన్పు సమయంలో సమస్యలు వస్తే గతంలో వారిని హైదరాబాద్‌కు తరలించేవారు. దీంతో వారి సంబంధీకులు అంత దూరం వెళ్లలేక పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించేవారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు ఇదే అదనుగా భావించి వారినుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజేవారు. హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో శిశువు, గర్భిణులకు ప్రాణాప్రాయంం ఏర్పడేది. ఈ పరిస్థితుల్లో ప్రతి గర్భిణి ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక చొరవ చూపారు.
మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న సిద్దిపేటలో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించి ఆ దిశగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంసీహెచ్‌లో ఉన్న బిల్డింగ్‌లో రూ. 16 లక్షలతో కేంద్రానికి అవసరమైన పరికరాలు, పడకలు ఇతర సామగ్రిని సమకూర్చారు. ఫిబ్రవరి 1న కలెక్టర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరిలో 73, మార్చిలో 87, ఏప్రిల్‌లో 101 శస్త్ర చికిత్సలను నిర్వహించడంతో పాటు ఈ నెల12వరకు మరో 37 శస్త్ర చికిత్సలను నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ఈ నెల 12వరకు కాన్పు సీరియస్‌గా ఉన్న గర్భిణులు 298 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. కాను సీరియస్‌గా ఉన్న పరిస్థితిల్లో వారంతా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ. 20 వేల చొప్పున బిల్లులు భరించాల్సి వచ్చేది.
ఈ కేంద్రం ఏర్పాటు వ్ల సుమారు రూ. 60లక్షల వరకు భారం తప్పింది. ఎంసీహెచ్‌లో వైద్యసేవలు పొందుతున్న గర్భిణులు కాన్పు సమయంలో సీరియస్‌గా ఉంటే వెంటనే హైరిస్క్ కేంద్రంలో చేర్చి శస్త్ర చికిత్స చేస్తారు. హైబీపీ, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు రక్తం అందజేస్తున్నారు. ఇక్కడ కూడా కాని సీరియస్ కేసులను హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. కేంద్రం ఇన్‌చార్జి 24గంటలు కేంద్రలో అందుతున్న సేవలను పర్యవేక్షిస్తున్నారు. గైనకాలజిస్ట్ అరుణ, అనెీస్థీషియన్ కృష్ణారావు గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలనందిస్తున్నారు.
50 పడకల ఆసుపత్రిగా మార్చాలి
ఈ కేంద్రంలో వైద్యసేవలు అందుతుండడంతో గర్భిణుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న 20 పడకలతో ఇబ్బందిగా ఉంది. 50 పడకల కేంద్రంగా మార్చాల్సిన అవసరముంది. రాత్రి వేళల్లో వచ్చేవారికి సేవలందించేందుకు వీలుగా వైద్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.
‘హైరిస్క్’లో ఉత్తమసేవలు
Published Tue, May 13 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
Advertisement