Mother and Child Hospital
-
భార్యాభర్తల కలహాలు: బిడ్డల గొంతుకోసి..
సాక్షి, వి.కోట : ఇద్దరు బిడ్డల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మండలంలోని అట్రపల్లె గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు అట్రపల్లె గ్రామానికి చెందిన ఆనంద్‌కు శాంతిపురం మండలానికి చెందిన మీనాక్షితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు మనోజ్ (7), కుమార్తె మధుమిత (5) సంతానం. కొంత కాలంగా భర్త ఆనంద్, భార్య మీనాక్షి మధ్య ఆర్థిక వ్యవహారాల కారణంగా కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం ఉదయం భర్తతో ఆమె గొడవపడింది. తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఉన్న వంట కత్తితో ఇద్దరు బిడ్డల గొంతు, చేయి కోసింది. అనంతరం ఆమె గొంతు, చేయి కోసుకుంది. తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడుతున్న తల్లి,బిడ్డలను గ్రామస్తులు వి.కోట సీహెచ్‌సీకి తరంలించారు.అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా కుప్పం పీఈఎస్ అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్‌బాబు తెలిపారు. తల్లి, పిల్లలకు ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. చదవండి: ఆకు పసరు ప్రాణం తీసింది -
‘హైరిస్క్’లో ఉత్తమసేవలు
సిద్దిపేట అర్బన్,న్యూస్‌లైన్: మహిళలకు కాన్పు పునర్జాన్మలాంటిదంటారు. ప్రసవ వేదనతో ఉన్న గర్భిణులకు సిద్దిపేట మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి (ఎంసీహెచ్)లోని హైరిస్క్ (సీమాంక్) కేంద్రం ద్వారా వైద్యులు విశిష్ట సేవలనందిస్తున్నారు. కాన్పు సమయంలో సమస్యలు వస్తే గతంలో వారిని హైదరాబాద్‌కు తరలించేవారు. దీంతో వారి సంబంధీకులు అంత దూరం వెళ్లలేక పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించేవారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు ఇదే అదనుగా భావించి వారినుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజేవారు. హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో శిశువు, గర్భిణులకు ప్రాణాప్రాయంం ఏర్పడేది. ఈ పరిస్థితుల్లో ప్రతి గర్భిణి ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక చొరవ చూపారు. మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న సిద్దిపేటలో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించి ఆ దిశగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంసీహెచ్‌లో ఉన్న బిల్డింగ్‌లో రూ. 16 లక్షలతో కేంద్రానికి అవసరమైన పరికరాలు, పడకలు ఇతర సామగ్రిని సమకూర్చారు. ఫిబ్రవరి 1న కలెక్టర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరిలో 73, మార్చిలో 87, ఏప్రిల్‌లో 101 శస్త్ర చికిత్సలను నిర్వహించడంతో పాటు ఈ నెల12వరకు మరో 37 శస్త్ర చికిత్సలను నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ఈ నెల 12వరకు కాన్పు సీరియస్‌గా ఉన్న గర్భిణులు 298 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. కాను సీరియస్‌గా ఉన్న పరిస్థితిల్లో వారంతా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ. 20 వేల చొప్పున బిల్లులు భరించాల్సి వచ్చేది. ఈ కేంద్రం ఏర్పాటు వ్ల సుమారు రూ. 60లక్షల వరకు భారం తప్పింది. ఎంసీహెచ్‌లో వైద్యసేవలు పొందుతున్న గర్భిణులు కాన్పు సమయంలో సీరియస్‌గా ఉంటే వెంటనే హైరిస్క్ కేంద్రంలో చేర్చి శస్త్ర చికిత్స చేస్తారు. హైబీపీ, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు రక్తం అందజేస్తున్నారు. ఇక్కడ కూడా కాని సీరియస్ కేసులను హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. కేంద్రం ఇన్చార్జి 24గంటలు కేంద్రలో అందుతున్న సేవలను పర్యవేక్షిస్తున్నారు. గైనకాలజిస్ట్ అరుణ, అనెీస్థీషియన్ కృష్ణారావు గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలనందిస్తున్నారు. 50 పడకల ఆసుపత్రిగా మార్చాలి ఈ కేంద్రంలో వైద్యసేవలు అందుతుండడంతో గర్భిణుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న 20 పడకలతో ఇబ్బందిగా ఉంది. 50 పడకల కేంద్రంగా మార్చాల్సిన అవసరముంది. రాత్రి వేళల్లో వచ్చేవారికి సేవలందించేందుకు వీలుగా వైద్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. -
ఆస్పత్రి అభివృద్ధికి కృషి
ఒంగోలు, న్యూస్‌లైన్: వైద్య సేవలు మరింత విస్తృతం చేయాలని మాతాశిశు వైద్యశాల కమిటీ చైర్మన్ బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. సోమవారం ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఆస్పత్రి సీ గ్రేడ్‌లో ఉండేదని, కానీ ప్రస్తుతం ఏ గ్రేడ్‌కు చేరిందని తెలిపారు. మాతా శిశువులకు సంబంధించి ప్రతి రోజూ 200కుపైగా ఓపీలు వస్తున్నట్లు తెలిపారు. ప్రసవాలు నెలకు 150 నుంచి 176కి పెరిగాయన్నారు. ఎక్స్‌రే తీయించాల్సి వచ్చినప్పుడు రిమ్స్‌ను ఆశ్రయించాల్సి వస్తుందని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా పోర్టబుల్ ఎక్స్‌రే యూనిట్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. 3.5 లక్షల నిధులతో కొనుగోలు చేసేందుకు బాలినేని అనుమతి మంజూరు చేశారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు హాజరైన సిబ్బందికి 1.31 లక్షల ప్రోత్సాహం ఇచ్చామన్నారు. ప్రస్తుతమున్న 80 పడకలను వంద పడకలుగా మార్చేందుకు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. సూపరింటెండెంట్ ఎస్ ఉషారాణి మాట్లాడుతూ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 జనవరి వరకు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల కోసం పిలిపించిన ప్రైవేటు మత్తు డాక్టర్లకు *2.21 లక్షలు చెల్లించినట్లు వివరించారు. ఈ విషయాన్ని రిమ్స్ డెరైక్టర్ దృష్టికీ తీసుకెళ్లామని తెలిపారు. తాజా రిక్రూట్మెంట్లో కనీసం అనస్తీషియా పీజీ డాక్టర్నైనా ఇవ్వాలని కోరారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, అన్ని సమస్యలు తీరతాయని బాలినేని వారికి భరోసా ఇచ్చారు. -
తాండూరులో 150 పడకల మాతా,శిశు ఆస్పత్రికి పచ్చజెండా
తాండూరు, న్యూస్‌లైన్: అధునాతన వైద్య సౌకర్యాలతో తాండూరులో నిర్మించతలపెట్టిన మాతా, శిశు ఆస్పత్రి (మదర్, చైల్డ్ హాస్పిటల్- ఎంసీహెచ్)కి స్థల సమస్య తీరిపోయింది. దీంతో ఆస్పత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో యాలాల రెవెన్యూ అధికారులు ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన ఐదెకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు ఏపీఎంఐడీసీ డీఈ నరేంద్ర, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వెంకటరమణప్ప సమక్షం లో గురువారం రెవెన్యూ అధికారులు ఆస్పత్రి నిర్మాణ ప్రతి పాదిత స్థలంలో పంచనామా నిర్వహించి, నాలుగు వైపులా హద్దురాళ్లను పాతారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు రెవెన్యూ అధికారులు ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన ఐదెకరాల భూ కేటాయింపు ధ్రువపత్రాన్ని అందజేశారు. తాండూరు-హైదరాబాద్ ప్రధాన రహదారికి పక్కన, సాం ఘిక గురుకుల పాఠశాల ఎదురుగా కోకట్ పరిధిలోని 52/ 67 సర్వేనంబర్‌లో స్థలంలో.. రూ.15కోట్ల నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నిధులతో 150 పడకలతో మాతా శిశు ఆస్పత్రిని నిర్మించనున్నట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణప్ప చెప్పారు. త్వరలోనే ఇంజినీర్ విభాగం అధికారులు ఆన్లైన్లో టెండర్ల ప్రక్రియ ను పూర్తి చేయనున్నారని ఆయన వివరించారు. నెలరోజు ల్లో ఆస్పత్రి నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు.