తాండూరు, న్యూస్‌లైన్: అధునాతన వైద్య సౌకర్యాలతో తాండూరులో నిర్మించతలపెట్టిన మాతా, శిశు ఆస్పత్రి (మదర్, చైల్డ్ హాస్పిటల్- ఎంసీహెచ్)కి స్థల సమస్య తీరిపోయింది. దీంతో ఆస్పత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో యాలాల రెవెన్యూ అధికారులు ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన ఐదెకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు ఏపీఎంఐడీసీ డీఈ నరేంద్ర, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వెంకటరమణప్ప సమక్షం లో గురువారం రెవెన్యూ అధికారులు ఆస్పత్రి నిర్మాణ ప్రతి పాదిత స్థలంలో పంచనామా నిర్వహించి, నాలుగు వైపులా హద్దురాళ్లను పాతారు.
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు రెవెన్యూ అధికారులు ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన ఐదెకరాల భూ కేటాయింపు ధ్రువపత్రాన్ని అందజేశారు. తాండూరు-హైదరాబాద్ ప్రధాన రహదారికి పక్కన, సాం ఘిక గురుకుల పాఠశాల ఎదురుగా కోకట్ పరిధిలోని 52/ 67 సర్వేనంబర్‌లో స్థలంలో.. రూ.15కోట్ల నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధులతో 150 పడకలతో మాతా శిశు ఆస్పత్రిని నిర్మించనున్నట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణప్ప చెప్పారు. త్వరలోనే ఇంజినీర్ విభాగం అధికారులు ఆన్‌లైన్‌లో టెండర్ల ప్రక్రియ ను పూర్తి చేయనున్నారని ఆయన వివరించారు. నెలరోజు ల్లో ఆస్పత్రి నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు.
తాండూరులో 150 పడకల మాతా,శిశు ఆస్పత్రికి పచ్చజెండా
Published Fri, Jan 24 2014 12:36 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement