భార్యాభర్తల కలహాలు: బిడ్డల గొంతుకోసి.. | Mother Trying Deceased Herself And Children In Chittoor District | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల కలహాలు: బిడ్డల గొంతుకోసి..

Published Sat, Mar 27 2021 10:42 AM | Last Updated on Sat, Mar 27 2021 11:01 AM

Mother Trying Deceased Herself And Children In Chittoor District - Sakshi

సాక్షి, వి.కోట : ఇద్దరు బిడ్డల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మండలంలోని అట్రపల్లె గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు అట్రపల్లె గ్రామానికి చెందిన ఆనంద్‌కు శాంతిపురం మండలానికి చెందిన మీనాక్షితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు మనోజ్‌ (7), కుమార్తె  మధుమిత (5) సంతానం. కొంత కాలంగా భర్త ఆనంద్, భార్య మీనాక్షి మధ్య ఆర్థిక వ్యవహారాల కారణంగా కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం ఉదయం  భర్తతో ఆమె గొడవపడింది.  

తీవ్ర  మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఉన్న వంట కత్తితో ఇద్దరు బిడ్డల గొంతు, చేయి కోసింది. అనంతరం ఆమె గొంతు, చేయి కోసుకుంది. తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడుతున్న తల్లి,బిడ్డలను గ్రామస్తులు వి.కోట సీహెచ్‌సీకి తరంలించారు.అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా  కుప్పం పీఈఎస్‌ అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్‌బాబు తెలిపారు. తల్లి, పిల్లలకు  ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.

చదవండి: ఆకు పసరు ప్రాణం తీసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement