
కడెం(ఖానాపూర్) : సాంకేతికరంగంలో దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో మూఢనమ్మ కం ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. నాటు వై ద్యం ఆశ్రయిస్తూ కొందరు ప్రాణాల మీద కు తెచ్చుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లింగాపూర్ గ్రామానికి సమీపంలో నివాసం ఉండే నక్క నర్సవ్వ–ఎర్రన్న దంపతుల కూతురు శిరీష(4) ఆదివారం పాము కాటుకు గురైంది.
సాయంత్రం పాము కుట్టడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లక పసరు, నాటువైద్యం పేరిట కాలయాపన చే శారు తల్లిదండ్రులు. గ్రామస్తులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో రాత్రి సమయంలో ఖా నాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయిందన్న వార్త విన్న తల్లి ఆసుపత్రి ఎదుట భోరున విలపించడం అందరిని కలిచివేసింది.