జంగారెడ్డిగూడెం రూరల్ :జంగారెడ్డిగూడెం శ్రీరామ్‌నగర్‌లో ఒక ఇంట్లో 16 సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన దాసరి మహాలక్ష్మయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె దాసరి చిట్టెమ్మను, జంగారెడ్డిగూడెం శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్న ఆర్‌ఎంపీ వైద్యుడు పీవీ మల్లేశ్వరరావు పెంచుకుంటున్నారు. మూడు సంవత్సరాలుగా చిట్టెమ్మ డాక్టర్ మల్లేశ్వరరావు వద్దే ఉంటోందని తల్లితండ్రులు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలకు తాను తనభార్యతో విజయవాడ శుభాకార్యానికి వెళ్లినట్లు డాక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు.
అయితే ఇంట్లో చిట్టెమ్మ ఉరి వేసుకున్న విషయం తన బావమరిది అయిన విజయకృష్ణ, కిషోర్ ఫోన్ ద్వారా తనకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఇంట్లో బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నితో వేలాడుతూ చిట్టెమ్మ మృతదేహం కనిపించింది. కాళ్లు కూడా నేలకు ఆనించి ఉండటంతో చిట్టెమ్మే ఉరివేసుకుని ఉంటుందా, లేక వేరే ఏదైనా ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు, సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై ఆనందరెడ్డిలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చిట్టెమ్మ మృతితో తల్లితండ్రులతో పాటు, బంధువుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. నిన్న రాత్రే తన కూతురు చిట్టెమ్మ ఫోన్లో మాట్లాడిందని చెబుతూ తల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
Published Mon, May 4 2015 3:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement