
సాక్షి, ముంబై : ఐరన్, విటమిన్ ట్యాబ్లెట్లు వికటించడంతో ముంబైలోని గోవంది మురికివాడలోని ఓ పాఠశాలలో 12 సంవత్సరాల బాలిక మరణించగా, 197 మంది చిన్నారులు ఆస్పత్రిపాలయ్యారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న161 మంది చిన్నారులను గట్కోపర్‌లోని రాజవాది ఆస్పత్రికి తరలించగా, 36 మంది చిన్నారులను గోవంది శతాబ్ధి ఆస్పత్రికి తరలించారని డాక్టర్ ప్రదీప్ జాదవ్ తెలిపారు.
స్కూల్‌లో ఇచ్చిన ఐరన్, విటమిన్ ట్యాబ్లెట్‌ను వేసుకున్న చందాని షేక్ అనే బాలిక గురువారం రాత్రి రక్తపు వాంతులు చేసుకుని మృత్యువాత పడిందని చిన్నారి తల్లితండ్రులు వెల్లడించారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే బాలిక మృతికి కారణాలు వెలుగులోకి వస్తాయని వైద్యులు తెలిపారు. తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని రాజవాది ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విద్యా ఠాకూర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment