విశాఖలో సైకో భయోత్పాతం
Published Fri, Jan 13 2017 1:12 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
- బాలిక మృతి, మరొకరికి గాయాలు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కైలాసపురంలో ఓ సైకో భయోత్పాతం సృష్టించాడు. తాగిన మైకంలో కత్తితో దాడి చేయడంతో ఓ పదేళ్ల బాలిక మృతిచెందింది. పక్కనే ఉన్న మరో ఎనిమిదేళ్ల బాలికకు తీవ్రగాయాలయ్యాయి. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కంచరపాలెం పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement