డెంగీతో బాలిక మృతి
Published Fri, Sep 30 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ జమాల్ కాలనీకి చెందిన ఓ బాలిక డెంగీతో బాధపడుతూ మృతి చెందింది. స్థానికంగా నివాసముంటున్న ఆయేషా(12) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.
Advertisement
Advertisement