డెంగీతో బాలిక మృతి | girl died with dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో బాలిక మృతి

Published Thu, Sep 1 2016 10:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

డెంగీతో బాలిక మృతి - Sakshi

డెంగీతో బాలిక మృతి

జవహర్‌నగర్‌: డెంగీతో ఓ బాలిక మృతిచెందిన ఘటన జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండల కేంద్రానికి చెందిన గోపి, మల్లీశ్వరీ దంపతులు బతుకుదెరువు కోసం వలస వచ్చి జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో నివాముంటున్నారు. వీరి పెద్దకూతురు గాయత్రి (4) నెలరోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా దమ్మాయిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించి డెంగీ సోకిందని వైద్యులు గుర్తించారు. అనంతరం తీవ్ర జ్వరం, వాంతులు రావడంతో ఏఎస్‌రావునగర్‌లోని అంకూర్‌ ఆస్పత్రికి..అక్కడి నుంచి పంజగుట్టలోని అంకూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో బాలిక గాయత్రి గురువారం తెల్లవారుజామున మృతిచెందింది.

నాలుగేళ్లకే.. నూరేళ్లు నిండాయా తల్లి..
ఈ సంవత్సరమే పాఠశాలకు వెళ్లి ఏబీసీడీలు నేర్చుకుంటున్న తమ కూతురుని చూసిమెంతో మురిసిపోయామనే.. అంతలోనే ఇలా మృత్యువాత పడుతుందను కోలేదని బాలిక తల్లిదండ్రులు గోపి, మల్లీశ్వరి రోదనలు మిన్నంటాయి. నాలుగేళ్లకే నీకు నూరేళ్లు నిండాయా... నా బంగారు కొండా.. అంటూ మల్లీశ్వరి గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement