బాలిక మృతదేహంతో ఆందోళన
సర్వీసు రోడ్లు పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం
గుడిహత్నూర్: రోడ్డు దాటుతున్న ఓ బాలికను లారీ ఢీకొనడంతో మృతి చెందింది. జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారిందని.. సర్వీసు రోడ్ల అసంపూర్తి నిర్మాణంతో ప్రమాదాలు జరుగుతున్నా యని ఆ బాలిక మృతదేహంతో గురువారం గ్రామ స్తులు, తల్లిదండ్రులు గుడిహత్నూర్‌లోని జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన హోళం బే రాజు, జ్యోతి దంపతుల కూతురు శృతి (11) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువు తోంది. బుధవారం రాత్రి పెన్సిల్, ఎరేజర్ కొను క్కోవడానికి 44వ నంబరు జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో శృతి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. చుట్టుపక్కల వారు అంబు లెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమ ధ్యంలో మృతి చెందింది. సర్వీసు రోడ్లు అసం పూర్తిగా ఉండడంతో గతంలోనూ ప్రమాదాలు జరి గాయి. ఈ క్రమంలో స్థానికులు అండర్ టన్నెల్ బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు ఆందోళన చేశారు. అలాగే, గురువారం గ్రామస్తులు రోడ్డుపై టెంటు వేసి ఆమె మృతదేహంతో బైఠాయించారు. జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని రాసివ్వడంతో ఆందోళన విరమించారు.