రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి | child Died In A road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Published Sat, Mar 24 2018 11:28 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

child Died  In A road accident - Sakshi

సిర్పూర్‌(టి): మండలంలోని పారిగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగు సంవత్సరాల చిన్నారి మతి చెందగా ఓ వద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సిర్పూర్‌(టి) ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని ధనోరా గ్రామానికి చెందిన నాగుబాయి అనే వద్ధురాలు తన మనవరాలైన రాంటెంకి ఇషాని(04) ని తీసుకోని పారిగాం గ్రామంలోని ఓ పెళ్లి వేడుకలకు వచ్చింది. పారిగాం గ్రామంలో ఆటో దిగి గ్రామంలో జరిగే పెళ్లి వేడుకలకు వెళ్తుండగా సిర్పూర్‌(టి) నుంచి లోనవెల్లి గ్రామం వైపు వెళ్తున్న లోనవెల్లి గ్రామానికి చెందిన ఔత్కర్‌ శరత్‌ బైక్‌తో వీరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇషాని మతి చెందింది నాగుబాయికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement