
చిన్నారి ఆద్య (ఫైల్ ఫొటో)
షాబాద్(చేవెళ్ల): ఓ చిన్నారిని స్కూల్ బస్సు చిది మేసింది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో సోమవారం జరి గింది. షాబాద్ మండ లం గోపిగడ్డకు చెందిన మోముల చంద్రశేఖర్‌రెడ్డి, లావణ్య దంపతులకు కుమారుడు సాత్విక్‌రెడ్డి, కూతురు ఆద్య (22 నెలలు) ఉన్నారు. బాలుడు షాబాద్‌లోని మాంటిస్సోరి స్కూల్లో చదువుతున్నాడు. సోమవారం ఉదయం గ్రామంలోకి వచ్చిన స్కూల్ బస్సులోకి కుమారుడిని ఎక్కించేందుకు చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చాడు. అదే సమయంలో కూతురు ఆద్య ఇంట్లో నుంచి రోడ్డుపైకి వస్తుండగా డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు తీసుకెళ్లాడు. ఆద్య చక్రాల కింద పడిపోయి తల ఛిద్రమై మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment