సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ మృతి నమోదైంది. ఆదిలాబాద్‌కు చెందిన గీతకు (18) స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతిచెందింది.
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ మృతి నమోదైంది. ఆదిలాబాద్‌కు చెందిన గీతకు (18) స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతిచెందింది. ఈ ఏడాది జనవరి నుంచి గాంధీ ఆస్పత్రిలో జరిగిన స్వైన్‌ఫ్లూ మరణాల సంఖ్య 65కు పెరిగింది. గాంధీ ఐసోలేషన్ వార్డులో చిన్నారితోపాటు తొమ్మిది మంది స్వైన్‌ఫ్లూ బాధితులకు, డిజాస్టర్, ఏఎంసీ వార్డులో 22 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితులకు వైద్య సేవలు అందిస్తున్నారని గాంధీ నోడల్ అధికారి కే. నర్సింహులు తెలిపారు.