
గుంటూరు ఆస్పత్రిలో మరో దారుణం
గుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగానే ఓ బాలిక మృతిచెందింది. అయితే, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రి వద్ద తమకు న్యాయం చేయాలంటూ బాలిక మృతదేహంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు. గత నెల ఎలుకలు కొరకడంతో ఓ పసివాడు మృతిచెందిన విషయం విదితమే.