హైదరాబాద్‌లోని మోతీనగర్ సమీపంలో స్కూలు బస్సు ఢీకొని ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మోతీనగర్ సమీపంలో స్కూలు బస్సు ఢీకొని ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ది స్లేట్ స్కూలుకు చెందిన బస్సు ఢీకొట్టి ఆక్స్‌ఫర్డ్ స్కూలులో చదువుకుంటున్న సానియా(8) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.