వైఎస్‌ఆర్‌ జిల్లాలో దారుణం | Girl killed allegedly by parents in ysr district | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ జిల్లాలో దారుణం

Published Sat, Aug 26 2017 2:01 PM | Last Updated on Tue, Sep 12 2017 1:02 AM

Girl killed allegedly by parents in ysr district

ప్రొద్దుటూరు: వైఎస్సార్‌ కడప జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు అమృతానగర్‌కు చెందిన దంపతులు కన్నకూతురిని దారుణంగా హత్యచేశారు. అనంతరం కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి కిడ్నాప్‌ డ్రామాకు తెరతీశారు. స్థానికంగా నివాసముంటున్న గైబుషా, ఫాతిమా దంపతులు తమ ఐదేళ్ల కూతురు రొఖియా(5) కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ క్రమంలో దంపతులిద్దరు పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో  ఇంటి ఆవరణలోనే పాప మృతదేహాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులను గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. చిన్నారి రొఖియాకు మెదడువాపు వ్యాధి సోకడంతో తల రోజు రోజుకు లావుగా పెరుగుతూ అంద వికారంగా కనిపిస్తుండటంతో తామే హతమార్చి నీళ్ల బకెట్లో పడేశామని పోలీసులకు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement