
డ్రైవర్ నిర్లక్ష్యానికి బాలిక మృతి
వేములపల్లి: నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఆగమోత్కూరులో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి నిండు ప్రాణం బలి అయిపోయింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లగా కుమార్తె రక్ష(5) కూడా వారితో వెళ్లింది. అక్కడ ఆమె ఆడుకుంటుండగా ట్రాక్టర్ డ్రైవర్ ఆమెను గమనించకుండా నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను వెనుకకు నడిపాడు. దీంతో ట్రాక్టర్ కింద పడిపోయిన ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది.