కదులుతున్న బస్సులోంచి తోసేశారు | Girl, 14, Dies After Being Thrown Off Bus for Resisting Molesters in Punjab | Sakshi
Sakshi News home page

కదులుతున్న బస్సులోంచి తోసేశారు

Published Thu, Apr 30 2015 9:09 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

కదులుతున్న బస్సులోంచి తోసేశారు

కదులుతున్న బస్సులోంచి తోసేశారు

మోగా: తమ కూతురుపై ఆకృత్యాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకున్నందుకు కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో కూతురు చనిపోగా కన్నతల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. మోగా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ తల్లి, పద్నాలుగేళ్ల కూతురు, కుమారుడు కలిసి గురుద్వారా దర్శనానికి ప్రైవేట్ బస్సులో బయలు దేరారు. పది కిలో మీటర్లు వెళ్లాక బస్సులోని కొందరు వ్యక్తులు తమ కూతురుతో తప్పుడుగా ప్రవర్తించడం గుర్తించిన తల్లి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి మొదట ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కండక్టర్కు ఫిర్యాదు చేయగా అతడు కూడా చెడుగా ప్రవర్తించినవారితో జతకట్టి అందరూకలిసి తల్లిని కూతురుని తిట్టడం మొదలుపెట్టారు.

భయంతో ఆ తల్లి బస్సు డ్రైవర్ వద్దకు వెళ్లి బస్సు ఆపాల్సిందిగా బతిమిలాడుకున్నా.. అతడు ఆపకుండా నడిపాడు. అలా పదిహేను నిమిషాల పాటు వారిని బస్సులో ఇబ్బంది పెట్టి కిందికి తోసేశారు. దీంతో రోడ్డు మీద పడి బలమైన గాయాల పాలయిన బాలిక.. గంటలపాటు ఎవరి సాయం అందక నడిరోడ్డుపైనే ప్రాణాలుకోల్పోయింది. గాయాలపాలయిన తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బస్సును గుర్తించిన పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement