![Cricket Australia Closes Probe Into Moeen Ali Sledge Claim - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/24/Moeen-Ali.jpg.webp?itok=e90xjjja)
మొయిన్ అలీ
సిడ్నీ: తనపై ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు ‘ఒసామా’ అని సంబోధిస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణకు కూడా ఆదేశించింది. తాజాగా తమ విచారణలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇంతటితో ఈ విచారణను ఆపేస్తున్నామని పేర్కొంది.
‘ఈ ఘటన సమయంలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సూచనల మేరకు మా టీం మేనేజ్‌మెంట్ విచారణ చేపట్టింది. అప్పుడే మొయిన్ అలీకి తమ స్పందనను కూడా తెలియజేయడం జరిగింది. అతను ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరోసారి విచారణ చేపట్టిన మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నాం’ అని సీఏ అధికార ప్రతినిధి ఒకరు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 2015 యాషెస్ సిరీస్ సందర్భంగా కార్డిఫ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఆటగాడు తనను ఉద్దేశించి ‘ఒసామా’ అని సంబోధించాడని అలీ తన ఆత్మకథలో రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment