democratic party candidates
-
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్‌హౌస్‌లో కూర వాసనలే ఉంటాయి. వైట్‌హౌస్‌లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్‌పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమెరికా మరింత నాగరికం కాబోతోందా?
యు.ఎస్. ప్రతినిధుల సభలోకి కొత్తగా తొమ్మిదిమంది మహిళా ఫెమినిస్టులు వచ్చారు! ఇప్పటికే సభలో స్పీకర్ మహిళ. ఆమె కూడా ఫెమినిస్టే. రెండు సభల్లోనూ (ఇంకోటి సెనెట్) మహిళలకు మద్దతుగా ఉండే ‘ప్రథమ మహిళ’ కూడా ఫెమినిస్టే. ఉపాధ్యక్షురాలు స్త్రీవాది. వీళ్లందరి శక్తి యుక్తులతో అమెరికా మరింత నాగరికం కాబోతోందా? ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని మనం కేరళను అంటున్నట్లుగా.. యూఎస్ ‘బ్లాక్స్ ఓన్ కంట్రీ’ అన్నంతగా సెన్సివిలైజ్ (సహజాతీయకరణ) చెందబోతోందా? యు.ఎస్. ప్రతినిధుల సభలో ప్రస్తుతం 119 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వారిలో కొత్తగా ఈ ఏడాది జనవరిలో సభలోకి అడుగుపెట్టిన వారిలో తొమ్మిది మంది స్త్రీవాదులే కావడం ఇప్పుడొక విశేషం అయింది. సాధారణంగా ప్రతి మహిళా స్త్రీవాదిగానే ఉంటారు. స్త్రీల సమస్యల్ని ఆలోచించి పరిష్కారాల కోసం మార్గాలను అన్వేషించేవారు, అవసరమైతే పోరాడే వారే స్త్రీవాదులు. అయితే ఈ తొమ్మిది మంది మరింత శక్తిమంతమైన వారు. ప్రత్యక్షంగా పోరులో పాల్గొన్నవారు. అవసరం అయితే ప్రథమ మహిళను, సభ స్పీకర్, ఉపాధ్యక్షురాలినీ ప్రభావితం చేయగలిగినవారు. ఏకాభిప్రాయాన్ని కూడగట్టుకోగలిగినవారు. చట్టాలను చేయించగలిగినవారు. నికేమా విలియం, కోరీ బుష్, మ్యారీ న్యూమేన్, మ్యారిలిన్ స్ట్రిక్‌ల్యాండ్, తెరిసా లేజర్, శారా జాకబ్స్, క్యాథీ మ్యానింగ్, డొబోరా రాస్, కొరొలీన్.. ఆ తొమ్మిది మంది శక్తి స్వరూపిణులు. మన భాషలో ‘నవ దుర్గ’లు. వీళ్లంతా కూడా డెమోక్రాటిక్ పార్టీకి చెందినవారే. స్పీకర్ నాన్సీ పెలోసీ డెమోక్రాటిక్ పార్టీనే. ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎలాగూ అదే పార్టీ. పై తొమ్మిది మందిలో నలుగురు ‘ఉమెన్ ఆఫ్ కలర్’. అంటే నాన్–అమెరికన్లు. ∙∙∙ ఈ తొమ్మిది మందిలో ప్రతి ఒక్కరికీ ఒక పోరాట నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఇప్పుడు అమెరికా కొత్త ప్రభుత్వ పాలనలో.. స్త్రీ సంక్షేమం కోసం, నల్లజాతి ప్రజలతో సమభావన కోసం వీరు ప్రతిపాదించే విధానాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. నికేమా విలియమ్స్‌నే తీసుకోండి. సభలో ఎవరి పదవీకాలం అయినా రెండేళ్లు కనుక ఈ రెండేళ్లలోనూ నికేమా అనేక ఆశ్చర్యాలను చేయబోతున్నారనే అనిపిస్తోంది. సభలోకి రాకముందు జార్జియా స్టేట్ సెనెటర్‌గా ఉన్నప్పుడు ఎన్నికలలో అక్రమాలకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిపి అరెస్ట్ అయ్యారు. కోరీ బుష్, మ్యారీ న్యూమేన్ తమ పురుష ప్రత్యర్థుల్ని ఓడించి సభలోకి అడుగుపెట్టినవారు. అదొక ఘన విజయం. నిజమైన జాతీయ భావన అంటే అన్ని జాతుల్ని కలుపుకుని వెళ్లడం అని ఈ ఇద్దరూ తమ ప్రసంగాలతో మెప్పించారు. కొత్తగా సభలోకి వచ్చిన ఈ తొమ్మిది మందిలో విలియమ్స్‌తో పాటు కోరీ బుష్, మ్యారిలీన్ స్టిక్‌ల్యాండ్, థెరెసా లేజర్ ‘నాన్–అమెరికన్’లు. ‘బ్లాక్ లైవ్జ్ మేటర్’ కార్యకర్తలు. శారా జాకబ్స్ స్త్రీ శిశు సంక్షేమ చట్టాల చట్టాలకు అవసరమైన సవరణలు సూచించగలరు. క్యాథీ మ్యానింగ్ స్కూళ్ల సంస్కరణ వాది. డెబోరా రాస్ మానవ హక్కుల న్యాయవాది. కరోలిన్ ఆర్థిక వ్యవహారాల నిపుణురాలు. ఈ నైపుణ్యాలు, పోరాట పటిమలు అన్నీ యూఎస్ ప్రతినిధుల సభ ప్రో–ఉమెన్ నిర్ణయాలు తీసుకునేలా చేయ గలిగినవే. ఈ స్త్రీవాదులకు ఎలాగూ మిగతా మహిళా సభ్యుల మద్దతు ఉంటుంది. అంటే.. మనమొక సమభావన కలిగిన సరికొత్త ఆమెరికా ను, ఆ కొత్త వెలుగులో సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామనే. -
బైడెన్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా అధ్యక్ష అభ్యర్థిగా 77 ఏళ్ల వయసున్న జో బైడెన్‌ను నామినేట్ చేశారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సాహసం కలిగిన నాయకుడు బైడెన్ అని నేతలందరూ కొనియాడారు. నామినేట్ అయ్యాక జో బైడెన్‌తన జీవితంలో దక్కిన అతి గొప్ప గౌరవం ఇదేనని ట్వీట్ చేశారు. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ను అధికారికంగా ప్రకటించి అమెరికా ప్రజల గుండె చప్పుడు ఏంటో పార్టీ చెప్పిందని బైడెన్ సతీమణి జిల్ బైడెన్ భావోద్వేగానికి లోనయ్యారు. అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో ట్రంప్ కంటే బైడెన్ 7.7 పాయింట్లు అధికంగా సంపాదించి ముందంజలో ఉన్నారు. టీవీ చూడడమే ట్రంప్ చేసే పని :క్లింటన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశానికి అధ్యక్షుడిగా ఉంటూ టీవీ చూస్తూ కాలం గడపడం, సోషల్ మీడియాలో ప్రజల్ని గందరగోళానికి గురి చేయడమే ఆయన చేస్తున్న పని అని ఆరోపించారు. అధ్యక్ష కార్యాలయాన్ని కమాండ్ సెంటర్ బదులుగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. అమెరికాకి పూర్వ వైభవం తీసుకువచ్చే సత్తా బైడెన్‌కే ఉందని క్లింటన్ వ్యాఖ్యానించారు. -
డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్‌కు మేలు
వాషింగ్టన్: తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, భారత్ సరిహద్దుల్లోనూ, ఇతర భూభాగాల్లోనూ, భారత్ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమించడంలో అమెరికా భారత్ పక్షం వహిస్తుందని డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడానికీ, ఇండో అమెరికన్లు పరస్పర సహకారంతో కలిసి జీవించడానికి, ఇరుదేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడానికి కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞచేశారు. అమెరికాలో నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జో బైడెన్ తలపడుతున్నారు. ‘పదిహేనేళ్ల క్రితం భారత దేశంతో చారిత్రాత్మక అణ్వాయుధ ఒప్పందం కొరకు ప్రయత్నం చేశాను. భారత్, అమెరికాల మధ్య మైత్రీ సంబంధాలు బలపడితే, యావత్ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని ఆనాడే నేను చెప్పాను’’అని భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి, ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రపంచం ఎదుర్కొంటోన్న వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్య రక్షణపై దృష్టిసారిస్తామని బైడెన్ చెప్పారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో, దేశ చరిత్రలోనే అత్యధికంగా భారతీయులను వివిధ పదవుల్లో నియమించినట్లు, ఇప్పుడు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉపాధ్యక్షురాలిగా పోటీలో నిలిపామని ఆయన అన్నారు. భారత దేశానికి చెందిన హిందూ, సిక్కు, ముస్లిం, జైన్, ఇతరులపై జరుగుతోన్న దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు. హెచ్–1బీ వీసా... హెచ్–1బీ వీసాల విధానాన్ని సంస్కరించి, గ్రీన్ కార్డుల కోసం దేశాల వారీగా ఇచ్చే కోటా విధానాన్ని రద్దు చేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో జాతి విద్వేషాలు పెరుగుతున్నాయని, ఇతర దేశాల వారిపై ఆంక్షలు విధిస్తూ, హెచ్–1బీ వీసాలపై హానికరమైన, కఠిన చర్యలకు పూనుకుంటున్నారని బైడెన్ వ్యాఖ్యానించారు. గ్రీన్ కార్డుల సంఖ్యను పెంచుతామని, కుటుంబ సభ్యుల రాకపై ఆంక్షలు తొలగిస్తామని, అమెరికాలో చదివిన విద్యార్థులపై ఆంక్షలు ఎత్తివేస్తామని, ఉపాధి కోసం వచ్చేవారికి ఉద్యోగ వీసాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. అమెరికాలో భారతీయుల రక్షణ కోసం, తొలిసారిగా డెమొక్రాటిక్ పార్టీ ఒక విధానపత్రంతో ముందుకు వచ్చింది. -
నల్ల పిడికిళ్ల నవ సందేశం
ఈ ఉద్యమం అక్కడ మరొక నూతన కోణాన్ని ఆవిష్కరించింది. నల్లజాతి ప్రజలపైన సాగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపైన రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను బహిరంగంగా సభల్లో నిలదీసి వాళ్ల వైఖరిని వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోటీపడుతున్న అభ్యర్థులను కూడా నిలదీస్తున్నారు. అందులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపు తుండగా, రిపబ్లికన్ పార్టీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. ‘అమెరికాలో ఏటా వందల మంది నిరాయుధులైన నల్లజాతి యువతీ యువకులను పోలీసులు కాల్చి చంపుతున్నారు. ఎంతమంది పోలీసుల చేతిలో చనిపోతున్నారో నిర్ధారించే నిర్దిష్టమైన లెక్కలు లేవు. శాంతిభద్రతల పేరుతో నల్లజాతి యువతీయువకులను పోలీసులు పొట్టన పెట్టుకుంటు న్నారు.’ 2015 జూన్‌లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిని నివేదించింది. పోలీసులు ఆయుధాలను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు, మనుషుల ప్రాణాలకు కనీస భద్రత, రక్షణ కరువయ్యాయని ఆమ్నెస్టీ ఆక్రోశించింది. స్వదేశీ చట్టాలనూ, ఐక్యరాజ్య సమితి నిబంధనలనూ కూడా అమెరికా పోలీసులు ఖాతరు చేయడంలేదనీ, వర్ణవివక్ష వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనీ నివేదిక పేర్కొ న్నది. పోలీసు విధులకు సంబంధించి అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో అంత ర్జాతీయ నిబంధనలను అమలు చేయాలి. కానీ వాషింగ్టన్ (డిసి) సహా తొమ్మిది రాష్ట్రాల్లో విధి నిర్వహణలో పోలీసులు ఆయుధాలను వినియో గించడం పైన నిబంధనలు లేవు. పదమూడు రాష్ట్రాల్లో చట్టాలూ, శాసనాలూ చాలా లోపభూయిష్టంగానే ఉన్నాయి. ఇటీవల అమెరికాలో జరిగిన ఘటన లను ఇదే నేపథ్యం నుంచి పరిశీలించాలి. గత బుధవారం మినిసాంటాలో 32 సంవత్సరాల ఫిలాండో కాస్టిలె అనే నల్లజాతి యువకుడిని పోలీసులు కాల్చి చంపినట్టు తెలిపే వీడియోను ఆయన స్నేహితురాలు డైమండ్ రెనాల్డ్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది అమెరికాను కలచివేసింది. ఇందుకు నిరసనగా నల్లజాతీయులు వీధుల్లోకి వచ్చారు. ఇందులో భాగం గానే డాలస్ నగరంలో జరిగిన ప్రదర్శనలో ఒక నల్లజాతి యువకుడు ఐదుగురు పోలీసు అధికారులను కాల్చివేసాడు. ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ కాల్పులు జరిపిన ఇరవై అయిదు సంవత్సరాల యువకుడు మికా జాన్సన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ‘ఇటీవల జరిగిన పోలీసు హత్యలు నన్ను కలవరపరిచాయి. ఇది చేసింది శ్వేత జాతికి చెందిన పోలీసు అధికారులు. అందుకే ఆ తెగకు చెందిన అధికారులను లక్ష్యంగా ఎంచుకున్నాను.’ అని చెప్పారు. అయితే ఆ తరువాత పోలీసులు మికా జాన్సన్‌ను కూడా రోబోట్ ద్వారా కాల్చి చంపారు. నల్లజాతి యువతీయువకులపై జరుగుతున్న దాడులు, హత్యలకు నిరస నగా గత కొద్దిరోజులుగా అమెరికాలోని అన్ని నగరాల్లో ప్రదర్శనలు జరుగు తున్నాయి. ఈ ప్రదర్శనల్లో అనేక నినాదాలతో పాటు, ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అన్న నినాదం ప్రత్యేకంగా కనిపిస్తున్నది. నిజానికి అది నినాదం కాదు, సంస్థ పేరు. ఇటీవలి కాలంలో విస్తృతంగా కొనసాగుతున్న పోలీసు హత్యలను నిరసిస్తూ అమెరికాలో వెల్లువెత్తిన ఉద్యమాలు గత అనుభవాలనుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపిస్తున్నది. అమెరికాలోని నల్లజాతి హక్కుల ఉద్యమకారులు ఈ ఉద్యమంలో సోషల్ మీడియాను చాలా శక్తిమంతంగా ఉపయోగించుకున్నారు. ఆ మీడియాని ఆయుధంగా వాడుకున్నారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ను సంక్షిప్తంగా బి.ఎల్.ఎమ్. అని ప్రచారంలోకి తెచ్చారు. 2013 జూలైలో ఉద్యమం మొదలైనప్పటికీ, 2014 వేసవిలో ఇది ఊపం దుకున్నది. ఫెర్గుసన్లో మైఖేల్ బ్రౌన్, న్యూయార్క్ సిటీలో ఎరిక్ గార్నర్లను పోలీసులు కాల్చి చంపిన ఘటనలపై బి.ఎల్.ఎమ్. దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. జార్జి జిమ్మర్ మాన్ అనే అధికారిని, నల్ల జాతీయుడైన ట్రేవాన్ మార్టిన్ హత్యకేసులో నిర్దోషిగా ప్రకటించడంతో బి.ఎల్.ఎమ్. ప్రస్థానం మొదలైంది. ‘నల్లజాతీయుల ప్రాణాలు కూడా ప్రాణాలే’ అనే సందేశంతో సోషల్ మీడియా అట్టుడికిపోయింది. అలిసియా గార్జా, పాట్రిస్సె కుల్లర్స్, వోపల్ టొమెటె అనే ముగ్గురు ఈ ఉద్యమ వ్యవస్థాపకులు. నల్ల జాతిలో నాయకత్వ లక్షణాలను, ఆత్మగౌరవాన్ని వృద్ధి చేయడానికి పని చేస్తున్న ‘బోల్డ్’ అనే సంస్థలో వీరంతా కలిశారు. ఆఫ్రికన్ - అమెరికన్ పౌరహక్కుల ఉద్యమం, బ్లాక్ పవర్ మూవ్ మెంట్, 1980 బ్లాక్ ఫెమినిస్ట్ ఉద్యమం, వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం, హిప్ హాప్, వాల్‌స్ట్రీట్ స్వాధీన ఉద్యమాల నుంచి తాము స్ఫూర్తి పొందినట్టు బి.ఎల్.ఎమ్. వ్యవస్థాపకులు ప్రకటించుకున్నారు. ఈ బృందంలో ఒకరైన అలిసియా గార్జా మొదటగా సోషల్ మీడియాలో పోస్ట్చేసిన నినాదాలలో ‘అవర్ లైవ్స్ మ్యాటర్-బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ కూడా ఒకటి. 2014 ఆగస్టులో ఫెర్గుసన్లో మైఖేల్బ్రౌన్ను కాల్చి చంపిన సంఘటనకు నిరసనగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఫ్రీడం రైడ్’ ప్రదర్శనను మొదటిసారిగా నిర్వహించారు. ఆ విధంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే నినాదం ఉద్యమ నాదమైంది. దాదాపు అయిదు వందల మందికి పైగా పాల్గొన్న ఈ ప్రదర్శన జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. 2014 నవంబర్‌లో అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ఉన్న పెద్ద దుకాణాలు, మాల్స్ ఎదుట చేపట్టిన నిరసనలు కూడా అమెరికా ప్రజల్లో ప్రభావాన్ని కలుగజేసాయి. 2015లో మేరిలాండ్‌లోని బాల్టిమోల్లో ఫ్రెడ్డిగ్రే హత్యానంతరం మరింత శక్తిమంతంగా ఈ ఉద్యమాన్ని నిర్వహించడానికి ఉద్యమకారులు పథకాలను రూపొందించారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. పాత తరం నల్లజాతి ఉద్యమ నాయకులతో వీళ్లు తెగతెంపులు చేసుకున్నారు. ఉద్యమంలో చర్చి ప్రభావాన్ని తగ్గించారు. రాజకీయ పార్టీలకు విధేయంగా ఉండే విధానాలను తిరస్కరించారు. మరొక ముఖ్య అంశం ఉద్యమాన్ని ప్రభావితం చేసే సాధనంగా సంగీతాన్ని ఎంచుకున్నారు. కెండ్రిక్ లామర్ అనే ప్రముఖ సంగీతకారుడు ఈ ఉద్యమానికి వెన్ను దన్నుగా ఉన్నారు. ఎన్నో సంఘటనలను వాళ్లు వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నల్లజాతి అనగానే నేరగాళ్లనే దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టడానికి సాంస్కృతిక రంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమ తాత్వికతను గురించి వ్యవస్థాప కులలో ఒకరైన అలిసియా గార్జా మాట్లాడుతూ, ‘నల్లజాతి ప్రజలు మానవ హక్కులను, పరువు, గౌరవాన్ని కోల్పోతున్న విధానాన్ని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఎత్తిచూపుతున్నది. నల్లజాతిపైన జరుగుతున్న నరమేధాన్ని, వారు అనుభ విస్తున్న పేదరికాన్ని సమాజం ముందు ఉంచుతున్నది. దాదాపు పది లక్షల మంది నల్లజాతి ప్రజలు ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న క్రూర నిర్బంధం పిల్లలను, మహిళలను సైతం వెంటాడుతున్నది. వేటాడుతున్నది. వీటన్నింటిపైన నిరసనగానే ఈ ఉద్యమాన్ని నడుపుతు న్నాం’ అని వివరించారు. ఈ ఉద్యమం అక్కడ మరొక నూతన కోణాన్ని ఆవిష్కరించింది. నల్ల జాతి ప్రజలపైన సాగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపైన రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను బహిరంగంగా సభల్లో నిలదీసి వాళ్ల వైఖరిని వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోటీపడుతున్న అభ్యర్థులను కూడా నిలదీస్తున్నారు. అందులో డెమో క్రటిక్ పార్టీ అభ్యర్థులు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతుండగా, రిప బ్లికన్ పార్టీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయ కులు, శ్వేతజాతి నాయకులు ఈ ఉద్యమాన్ని అతివాద ఉద్యమంగా ముద్ర వేసి విమర్శిస్తున్నారు. కేవలం నల్లజాతి ప్రజల జీవితాల గురించే మాట్లాడు తారా? మిగతా వాళ్లు మనుషులు కారా అని ప్రశ్నిస్తున్నారు. జాత్యహం కారంతో మాట్లాడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ప్రశ్నించిన బి.ఎల్.ఎమ్. కార్యకర్తపైన రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. దానికి నిరసనగా మరొక చోట బి.ఎల్.ఎమ్. కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శనతో డొనాల్డ్ ట్రంప్ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విమర్శ లన్నింటి కీ బి.ఎల్.ఎమ్. సమాధానం ఇచ్చింది. ‘నల్లజాతి ప్రజల జీవితాలు విలువైనవంటే, ఇతరులవి కావని కాదు. నల్లజాతిపై శ్వేతజాతీయుల ఆధి పత్యం, అధికారం కింద నలిగిపోకుండా ఉండాలని మేము కోరుకుంటు న్నాం’ అని స్పష్టం చేసింది. అమెరికా నల్లజాతి ఉద్యమం ఒక నూతన పంథాలో పయనిస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అవకాశాలను వాడుకోవడంలో విజయ వంతమైంది. సంఘటనలు జరిగిన వెంటనే స్పందించే విధంగా ఒక నెట్ వర్క్‌ను కూడా వృద్ధి చేసుకోగలిగింది. రాజకీయ నాయకత్వాన్ని నిలదీయడం వల్ల విధాన నిర్ణయాల వైపు, పాలనారంగంలో మార్పుల వైపు సరైన మార్పులు జరగడానికి అవకాశం చిక్కింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీలు, అభ్యర్థులు అధికారులు ఎవరైనా ఆ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు, అణచివేతలకు బాధ్యత వహించాలని ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం మరొకసారి రుజువు చేసింది. ప్రపంచ దేశాల్లో వివక్షకు వ్యతిరేకంగా సాగుతోన్న వేనవేల ఉద్యమాలకు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఒక నూతనోత్తేజాన్ని అందిస్తుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య