ulava
-
ఉలవల ప్రయోజనాలు తెలిస్తే, క్షణం ఆలస్యం చేయకుండా..!
#Horse Gram Health Benefits ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని మన పెద్దవాళ్లు చెప్పేవారు. మొదట్లో గుర్రాలు, పశువుల మేతగా ఉపయోగించేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, పేదవారి ఆహారంగా కూడా ఉండేది. తరువాతి కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉలవల్నే ఇంగ్లీషులో ‘హార్స్ గ్రామ్’ అనీ ఇంకా కులిత్, హర్డిల్ లేదా మద్రాస్ బీన్స్ అని కూడా పలుస్తారు. అంతేకాదు అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం ఉలవలు భవిష్యత్తులో మంచి ఆహార వనరుగా మారనుంది. చాలా పోషకాలతో నిండిన ఉలవల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిల్లో తెల్లవి, నల్లవి అని రెండు రకాలుగా లభిస్తాయి. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ లాంటివి పోషకాలు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి. బీ1, బీ2, బీ6, సీ, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారినికి సమానమైన ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఉలవలు ఆరోగ్య ప్రయోజనాలు ♦ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ♦ ఉలవల్లోని ఫైబర్ రక్తంలోగుండె ఆరోగ్యానికి మంచిది, చక్కెర స్థాయిని తగ్గించవచ్చు. ♦ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడండి. ♦ వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణలో తోడ్పడతాయి. ♦ రుతుక్రమ రుగ్మతలు , ల్యుకోరియా చికిత్సకు సాయపడుతుంది ♦ అతి మూత్ర వ్యాధికి చక్కటి ఔషధం ♦ స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ♦ కాలేయ పనితీరును రక్షిస్తుంది. ♦ ఎముకలను బలోపేతం చేస్తుంది ♦ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ♦ కాలేయ పనితీరును రక్షిస్తుంది ♦ మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుం ♦ కొన్ని ప్రాంతాల్లో ఉలవల పాలను పిల్లలకు పోషక ఆహారంగా ఇస్తారు నోట్: సాధారణంగా గింజలు, పప్పు ధాన్యాలను నాన బెట్టి తినడం మంచింది. ముఖ్యంగా ఉలవల్నినానబెట్టి ఉడికించడం వల్ల జీర్ణం సులభమవుతుంది. అధికంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం లాంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. దీన్ని గమనంలో ఉంచుకోవాలి. అలాగే హైపర్ ఎసిడిటీ సమస్య ఉన్న వారు అధిక ఆమ్లత్వం ఉన్నవారు గౌట్‌తో బాధపడేవారు కూడా ఉలవలకు దూరంగా ఉండటం మంచిది. -
ఉలవ సాగుకు ఇదే అదను
- ప్రత్యామ్నాయ పంటగానూ సాగు చేసుకోవచ్చు - అధిక దిగుబడితోపాటు బలమైన గ్రాసం - కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్ జాన్ సుధీర్ అనంతపురం అగ్రికల్చర్: ఉలవ సాగుకు ఇది అనుకూలమైన సమయం.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉలవ సాగు చేసుకుంటే మేలైన దిగుబడి సాధించొచ్చు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పెసర, అలసంద, జొన్న లాంటి వాటితో పాటు ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేసుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ రైతులకు సూచించారు. చివరగా కురిసే వర్షాలకు, తర్వాత చలి మంచుకు ఈ పంట చేతికొస్తుందన్నారు. బలమైన పశుగ్రాసంతో పాటు రైతుకు ఆదాయాన్ని కూడా ఇస్తుందన్నారు. ఇవీ విత్తన రకాలు: ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఉచితంగా అన్ని రకాల ప్రత్యామ్నాయ విత్తనాలతో పాటు ఉలవలు కూడా పంపిణీ చేస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఈ వర్షానికి పంట వేసుకోవాలి. హైబ్రిడ్ విత్తనాల విషయానికి వస్తే పీడీయం–1 అనే రకం 105 రోజుల పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పి.జడ్.యం–1 రకం 90 నుంచి 95 రోజుల పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. పీహెచ్‌జీ–62 రకం 85 రోజులకు వస్తుంది. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. పి.హెచ్.జి–9 రకం 90 నుంచి 100 రోజులకు పంట పూర్తవుతుంది. ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్ మందుతో కలిపి విత్తన శుద్ధి చేయాలి. యాజమాన్యం: భూమిని బాగా దుక్కి చేసుకొని గొర్రుతో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు విత్తుకోవాలి. వెదజల్లే పద్ధతిలో 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీ మీటర్ల దూరం పాటించాలి. ఎకరాకు 10 కిలోల యూరియా, 65 కిలోల సూపర్ పాస్పేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరు దుక్కిలో విత్తే ముందు వేసుకోవాలి. విత్తిన 25 రోజుల నుంచి 35 రోజుల మధ్య నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు దంతులతో కలుపు నివారణ చేసుకోవాలి. పూత, పిందె ఏర్పడే సమయంలో కాయతొలుచు పురుగు పంటకు నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు 2 మి.లీ క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణంలో అధిక తేమ ఉండి రాత్రి,పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
ఖరీఫ్ ప్రత్యామ్నాయం
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో ప్రధాన పంటలు వేసిన తర్వాత మిగిలిన భూముల్లో వర్షాధారంగా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేసుకోవచ్చునని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ జాన్‌సుధీర్ రైతులకు సూచించారు. చివరిగా కురిసే వర్షాలకు, తర్వాత చలి, మంచుకే ఈ పంట చేతికొస్తుందన్నారు. బలమైన పశుగ్రాసంతో పాటు రైతుకు ఆదాయాన్ని కూడా ఇస్తుందన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉలవ పంట వేసుకునేందుకు అనుకూలమని ఆయన తెలిపారు. విత్తనరకాలు, విత్తనశుద్ధి: పీడీఎం–1 అనే రకం 105 రోజుల పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. పీజడ్ఎం–1 రకం 90 నుంచి 95 రోజుల్లో పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. పీహెచ్‌జీ–62 రకం 85 రోజులకు వస్తుంది. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. పీహెచ్‌జీ–9 రకం 90 నుంచి 100 రోజులకు పూర్తవుతుంది. ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్ మందుతో కలిపి విత్తనశుద్ధి చేయాలి. యాజమాన్యం: భూమిని నాగలితో ఒకసారి, గొర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని తయారు చేసుకోవాలి. గొర్రుతో వరుసలో విత్తు పద్ధతిలో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు వేసుకోవాలి. వెదజల్లే పద్ధతిలో 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ఎకరాకు 10 కిలోల యూరియా, 65 కిలోల సూపర్ పాస్పేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరు దుక్కిలో విత్తే ముందు వేసుకోవాలి. విత్తిన 25 రోజుల నుంచి 35 రోజుల మధ్య నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు దంతులతో కలుపు నివారణ చేసుకోవాలి పూత, పిందె ఏర్పడే సమయంలో కాయతొలిచే పురుగు పంటకు నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు 2 మి.లీ క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. వాతావరణంలో అధిక తేమ ఉండి రాత్రి,పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.