ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధం ఇదే... | AP Agriculture Mission Vice Chairman MVS Nagi Reddy Speak on National Fish Farming Day | Sakshi
Sakshi News home page

మత్స్యరైతు దినోత్సవ శుభాకాంక్షలు:ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి

Published Wed, Jul 10 2019 12:37 PM | Last Updated on Wed, Jul 10 2019 12:50 PM

ఆరోగ్యంగా ఉండాలంటే  పౌష్టికాహారం చాలా ముఖ్యం. పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలలో చేపలు ప్రధానమైనవి. చేపలలో ప్రోటీన్‌లు, ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధంగా చేపను చెప్పవచ్చు. 2001 నుంచి కేంద్ర ప్రభుత్వం  ప్రతి ఏడాది జూలై 9, 10 తేదీల్లో జాతీయ మత్స్య రైతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆక్వా కల్చర్‌ ఫార్మింగ్‌ దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన కల్చర్‌గా అభివృద్ధి అవుతున్న తరుణంలో జాతీయస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి 5వేల మంది ప్రతినిధులు,అయిదువేల మంది ప్రజలు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపల పెంపకం సంబంధించిన సాంకేతిక సలహాలు, విశిష్ట ప్రసంగాలతోపాటు, 30కిపైగా రకాలు చేపల ప్రదర్శన, నోరూరించే చేపల వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు.  ఈ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ,వ్యవసాయ నిపుణులు యమ్‌వీఎస్‌ నాగిరెడ్డి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement