లండన్: బరువు తగ్గేందుకు బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రొటీన్ బార్స్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఓ అథ్యయనం హెచ్చరించింది. వీటిలో కొవ్వును కరిగించే పదార్థాలు ఏమీ లేవని ఈ పరిశోధన తేల్చింది. ప్రొటీన్ బార్లు అదే పనిగా తింటే అవి శరీరానికి మేలు కన్నా హానే తలపెడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రొటీన్ షేక్స్, బార్‌లు మెరుగైన జీవనశైలికి ప్రత్యామ్నాయం కాదని లండన్ డాక్టర్స్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ డేలియన్ ఫెంటాన్ చెప్పారు.
ప్రొటీన్ బార్స్‌లో పలు రకాల ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు, స్వీటెనర్లు, నూనెలు ఉంటాయని, వీటి వల్ల అధిక కొవ్వు చేరడం మినహా మరో ప్రయోజనం లేదని ఆయన వివరించారు. ప్రొటీన్ బార్స్‌ను ఆహారంగా తీసుకునేవారు బరువు పెరుగుతారని స్పష్టం చేశారు. 50 ప్రముఖ ప్రొటీన్ బార్స్‌లో ఉండే కొవ్వు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, చక్కెర ఏ మేరకు ఉంటాయనేదానిపై పరిశోధకుల బృందం క్షుణ్ణంగా అథ్యయనం చేసింది.
ప్రొటీన్ బార్స్‌లో అధిక కొవ్వులు ఉన్నాయని, వీటి ద్వారా బరువు తగ్గడం అసాధ్యమని పరిశోధకులు తేల్చారు. శరీర కండర నిర్మాణానికి అవసరమైన కీలక అమినో ఆమ్లాలు ఈ ప్రొటీన్ బార్స్‌లో లేవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment