లండన్: తీవ్ర గుండెపోటుకు గురైన తర్వాత మరో స్ట్రోక్ రాకుండా, కొవ్వును తగ్గించేందుకు వాడే స్టాటిన్స్ కీలకంగా పనిచేస్తున్నాయని తాజా అథ్యయనం తేల్చింది. ఇవి ప్రాణాపాయం నుంచీ రోగులను కాపాడుతున్నాయని తేలింది. తక్కువ డోస్ తీసుకునే వారి కన్నా స్టాటిన్స్ అధిక మోతాదులో తీసుకునే వారు ఐదు రెట్లు తక్కువగా గుండె పోటు, స్ట్రోక్‌కు గురువుతున్నారనీ ఈ అథ్యయనంలో వెల్లడైంది. సాల్ట్‌లేక్ సిటీలోని ఇంటర్‌మౌంటెన్ మెడికల్ సెంటర్ హార్ట్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ అథ్యయనం నిర్వహించారు. 1999 నుంచి 2013 మధ్య గుండె పోటు, స్ట్రోక్‌కు గురైన 62,000 మంది రోగుల వైద్య రికార్డులను వీరు పరిశీలించారు.
వీరిలో స్టాటిన్స్ తీసుకుంటున్న వారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారనే వివరాలను దీర్ఘకాలంగా పరిశీలించారు. గుండెపోటుకు గురైన వారిలో స్టాటిన్స్‌ను తీసుకుంటున్నవారు చాలా తక్కువగా మరోసారి గుండె పోటు లేదా స్ట్రోక్ బారినపడుతున్నారని తమ అథ్యయనంలో తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జెఫ్రీ అండర్సన్ తెలిపారు.
తక్కువ డోస్ వాడే వారి కన్నా అధిక స్టాటిన్ డోసేజ్ తీసుకుంటున్న వారిలో తదుపరి స్ట్రోక్ రిస్క్ 21 శాతం మేర తక్కువగా ఉందని చెప్పారు. హార్ట్ ఎటాక్ వచ్చిన రోగులకు కార్డియాలజిస్టులు కేవలం స్టెంట్ వేసి ఇంటికి పంపుతుండటంతో రోగులకు అవగాహన ఉండటం లేదని, తగిన మోతాదులో స్టాటిన్స్ మరింత మందికి ఇవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment