‘‘దిండుకు పనిచెబితే.. గుండె పదిలం’’
మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు నిరంతరం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజా పరిశోధన సరికొత్త విషయాన్ని గుర్తించింది. కంటి నిండా నిద్రపోతే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని తెలుసు, కానీ వారాంతాల్లో ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం, వారాంతాల్లో నిద్ర తప్పిన వ్యక్తుల్లో గుండె జబ్బుల ముప్పు 20శాతం తగ్గుతుంది. ముఖ్యంగా వారమంతా పని ఒత్తిడిలో ఉండి సరిగా నిద్రపోని వారికి వీకెండ్ నిద్ర గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొత్త పరిశోధన వెల్లడించింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వారాంతాల్లో నిద్రపోవడం తరచుగా ఆలస్యంగా నిద్రపోయే వారికి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వృత్తిరీత్యా స్లీపింగ్ సైకిల్ సరిగా లేని వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుందని వివరించింది.
ఆధునిక జీవనశైలి తరచుగా పని వారంలో నిద్రలేమికి గురయ్యేవారికి ఇది ఉపయోడ పడనుంది. చైనాలోని బీజింగ్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్‌లోని ఫువై హాస్పిటల్‌లోని స్టేట్ కీ లాబొరేటరీ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజ్‌కు చెందిన స్టడీ కో-రచయిత మిస్టర్ యంజున్ సాంగ్ మాట్లాడుతూ, "తగినంత పరిహార నిద్ర గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారం రోజుల్లో నష్టపోయిన నిద్రకు పరిహారంగా వారాంతపు రోజుల్లో క్రమం తప్పకుండా నిద్రను భర్తీ చేసుకునే వారిలో ఈ ఫలితం స్పష్టంగా కనిపిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment