పెళ్లిళ్లలోనూ ఏదైన పండుగ, జాతర్లలో పెట్టే డీజే మ్యూజిక్ వల్ల గుండె పోటు వస్తుందా?. ఈ ఏడాది మార్చి4న బిహార్‌లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. సురేంద్ర కుమార్ డీజే సౌండ్ తనకు చాలా అసౌకర్యంగా ఉందని, తగ్గించమని చెప్పినట్లు సమాచారం. ఆ భారీ శబ్దాల వల్లే సురేంద్ర కూమార్ చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు కూడా.
అలాగే తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అంతేకాదు గతేడాది నవండర్ 25న ఇలానే డీజే మ్యూజిక్‌లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. భారతదేశంలో ఇలాంటి ఘటనలు గతకొంతకాలంగా కోకొల్లలుగా జరగడంతో ప్రజల్లో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఎందుకిలా జరుగుతుంది?. శబ్దానికి గుండెపోటుకి సంబంధం ఏంటి? చెవికి గుండెకు ఉన్న లింక్ ఏమిటి తదితరాల గురించే ఈ కథనం..
భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో వెల్లడించారు. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు 500 మందిపై అధ్యయనం నిర్వహించారు. వారంతా రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో నివశిస్తున్నారు. నిత్యం భారీ శబ్దాల మధ్య పనిచేయడం లేదా నివశిస్తుంటారు. ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో గుండె జబ్బు లక్షణాలు లేని వ్యక్తులు సైతం హృదయ సంబంధ వ్యాధులకు గురైనట్లు గుర్తించారు.
పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరగుతున్న మార్పలను గుర్తించారు. అలాగే మెదడులో ఉండే బూడిద రండు పదార్థాం అమిగ్డాలాపై తీవ్ర ప్రభావం చూపినట్లు గుర్తించారు. ఒక రకంగా బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. అనునిత్యం పెద్ద శబ్దాల వద్ద పనిచేసే వ్యక్తుల్లో మానసిక కల్లోలం, అసహనం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
హృదయ స్పందనలు క్రమరాహిత్యం..
జర్మనీలో మెయిన్జ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో కూడా 35 నుంచి 74 ఏళ్ల వయసు ఉన్న 15 వేల మంది వ్యక్తులపై అధ్యయనం నిర్వహించారు. ఏ సంగీతాన్ని అయినా ఓ నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే మానవ హృదయాలపై హానికరమైన ప్రభావం చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. భారీ శబ్దానికి గురైనప్పుడూ హృదయ స్పందన వేగం ఒక్కసారిగా మారిపోవడం, భయం ఆందోళన ఒక్కసారిగా ఉత్ఫన్నమవుతున్నట్లు గుర్తించారు. చాలామంది, జాగింగ్ చేసేటప్పుడూ వ్యాయామాలు చేసేటప్పుడూ మ్యూజిక్ పెట్టుకుని చేస్తుంటారు ఇది అంత మంచి పద్ధతి కాదనే అంటున్నారు. ఓ మోస్తరుగా మనిషి వినగలిగేంత పరిమితి సౌండ్‌తోనే సంగీతం వింటే ఎటువంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకుని వినడం తగ్గించాలి..
చాల ఎక్కువ వాల్యూమ్‌లో ధ్వనిని వినడం చెవిలోని ఇంద్రియ కణాలు, నిర్మాణాలు అలసిపోతాయి. ఇది చాలాకాలం పాటు కొనసాగితే శాశ్వతంగా వినికిలోపం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని అధ్యయనంలో తేలింది. అందువల్ల ఎక్కువ గంటలపాటు పెద్ద పెద్ద వాల్యూమ్‌లో హెడ్‌ఫోన్ పెట్టుకుని వినడం, వివాహ ఫంక్షన్‌లో పెట్టే భారీ సంగీ మ్యూజిక్‌ల్లో పాల్గొనడం వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
గుండెకు చెవికి ఉన్న సంబంధం ఏంటీ ..
ఏదైన ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్న జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్‌లతో సాగే మ్యూజిక్ తరంగాలు మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తే.. మోతాదుకు మించిన వాల్యూమ్‌తో వినే మ్యూజిక్ గుండె, మెదడుపై అదే స్థాయిలో ప్రభావం చూపిస్తాయి. మన శరీరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి లింక్ అప్ అయ్యే ఉంటాయి. ఒక అవయవానికి ఏర్పడిన నష్టం దేహంలోని మిగతా అవయవాలపై ఎంతోకొంత ప్రభావం తప్పక ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
(చదవండి: గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..)
Comments
Please login to add a commentAdd a comment