నడుము నాజుగ్గా తీగలా ఉండాలని కోరుకుంటారు మహిళలు. అందుకు సంబంధించిన వ్యాయామాలు, వర్కౌట్‌లు తెగ చేస్తుంటారు. అయితే ఇలా అస్సలు చెయ్యొద్దని వార్నింగ్ ఇస్తున్నారు వైద్య నిపుణులు. నడుమ చుట్టుకొలత తక్కువగా ఉండాలని భావిస్తే ఆరోగ్య సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు. దీనిపై వైద్య నిపుణులు జరిపిన పరిశోధనలో చాలా షాకింగ్ విషయాలే బయటపడ్డాయి.
హుయిజోంగ్ జీ, బిన్ సాంగ్ వైద్యుల నేతృత్వంలోని నార్తర్న్ జియాంగ్సు పీపుల్స్ హాస్పిటల్ చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం వాళ్లు దాదాపు 6 వేల మందికిపైగా పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. సుమారు 2003 నుంచి 2019 వరకు వారి హెల్త్ డేటాను ట్రాక్ చేశారు. నడుము చుట్టుకొలత తక్కువగా ఉన్న మహిళలు ఎలా మరణాలకు దారితీసే ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారో సవివరంగా వెల్లడిచింది ఆ అధ్యయనం.
ఆ పరిశోధనలో నడుము చుట్టుకొలత తక్కువుగా ఉన్న మహిళలే ఎక్కువగా మరణాలకు దారితీసే గుండె సంబంధిత వ్యాధులు బారినపడుతున్నట్లు తేలింది. కనీసం ప్రతి మహిళ 107 సెంటీమీటర్లు నడుమ కొలత ఉండాలని, అంతకన్నా తక్కువుగా ఉంటే ప్రమాదమేనని పేర్కొంది. ఆరోగ్యంగా పరిగణించబడే దానికంటే ఎక్కువే ఈ నడుమ చుట్టుకొలత. ఇక పురుషుల నడుము కొలత కనీసం 89 సెంటీమీటర్లు ఉండాలని పేర్కొంది.
అందువల్ల మధుమేహం ఉన్న మహిళలు తమ నడుమ కొలత 107 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండేలా ప్రయత్నించొద్దని హెచ్చరించారు వైద్యులు. ఒకరకంగా ఈ అధ్యయనం ఊబకాయానికి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తుందటూ పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వైద్య నిపుణులు ఇంత సైజులో నడము ఉంటే పొత్తికడుపు వద్ద కొవ్వు పెరుకుపోతుంది ఇది అనారోగ్యమైనది అనే సందేహం అందరిలోనూ కలిగే అవకాశం ఉంటుందని అన్నారు.
నిజానికి ఇక్కడ ఈ అధ్యయనం అధిక బరువుని సిఫార్సు చేయడం లేదని నడుమ సైజు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే మరణానికి దారితీసే ఆరోగ్య ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంది. ఇది మనిషి జీవన నాణ్యతను తగ్గిస్తుందని అన్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చామని, మరింత సమాచారం కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఫిట్‌నెస్ సీక్రెట్ ..!)
Comments
Please login to add a commentAdd a comment