చాలమంది వర్క్‌ఔట్‌లు ఎక్కువగా చేస్తుంటారు. త్వరితగతిన బరువు తగ్గాలని లేదా మంచి ఫలితాలు కనిపించాలంటే ఆ మాత్రం వర్క్‌ఔట్‌లు ఉండాలని అనుకుంటారు. అందుకోసం అని వాకింగ్‌లు కొన్ని రకాల వ్యాయమాలు తెగ చేసేస్తుంటారు. ఐతే తాజా పరిశోధనలో అందుకు భిన్నంగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు కూడా మితంగా వ్యాయామం చేస్తే చాలని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు పదివేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని అధ్యయనంలో వెల్లడైందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తక్కువ వ్యాయామంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్‌పెట్టగలమా? పరిశోధనల్లో ఏం వెల్లడైంది తదితరాల గురించే ఈ కథనం!.
స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామంతోనే మంచి రిజల్ట్స్‌ని పొందొచ్చని ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం దాదాపు 60% తగ్గుతుందని కూడా వెల్లడైంది. ఈ మేరకు ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. అందుకోసం సుమారు లక్ష మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా పదివేల అడుగులు అవసరమని చెబతుంటారు. ఐతే అన్ని అడుగులు అవసరం లేదంటున్నారు.
కేవలం రెండు కిలోమీటర్లు అనగా దాదాపు 2,700 అడుగులు చాలు వివిధ గుండె సంబంధిత సమ్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచే వారిలో చాలా మంచి ప్రయోజనాలు కూడా కనిపించాయి. కానీ కొందరు ఎక్కువగా నడిస్తేనే మంచిదని భావించి బలవంతంగా చేస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదంటున్నారు. రోజుకు రెండు కిలోమీటర్లు నడవండి, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి చాలు చాలా రుగ్మతలు నుంచి సులభంగా బయటపడతారని అంటున్నారు. అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఏం ఉండదని పరిశోధనలో తేలిందన్నారు. తక్కువగా చేసిన మంచి ఫలితాలు ఉంటాయని భయపడాల్సి అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అదే టైంలో ఎక్కువగా చేసేవారికి ఆరోగ్య మరింత మెరుగ్గా ఉండటమేగాక మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని గుర్తించాం అని చెప్పారు.
ఐతే ఈ పదివేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చింది టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో వచ్చిందని. ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా పదివేల అడుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందని పేర్కొన్నారు. సైన్సు పరంగా అది ఎక్కడ ఫ్రూవ్ కాలేదన్నారు. ఈ నెంబర్ ఫిగర్ అందరు గుర్తుంచుకునేందుకు సులభంగా ఉంటుందని ఇలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల ప్రతీరోజూ తక్కువ వ్యాయామం, సుమారు రెండు కిలోమీటలర్లు నడకతో కూడా పూర్తి ఫిట్‌నెస్‌గా ఉండగలమని నొక్కి చెబుతున్నారు. దీంతోపాటు వేళకు తినడం, కంటి నిండ నిద్రపోవడం వంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగొంటుంది. తద్వారా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నం కావు అని చెబుతున్నారు పరిశోధకులు.
(చదవండి: 'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా? వెలుగులోకి షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment