ఇటీవల డీజే ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతి శుభకార్యంలో భారీ భారీ సౌండ్ సిస్టమ్ కామన్ అయిపోయింది. దద్దరిల్లిపోయే డీజే చప్పుళ్లకు చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. మితిమీరిన సౌండ్, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ బాలుడు భారీ డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.
భోపాల్‌లో సమర్ బిల్లోర్ అనే 13 ఏళ్ల బాలుడు స్థానిక పండుగ వేడుకలో తన వివాసం వెలుపల డీజే సౌండ్‌కు ప్రజలు డ్యాన్స్ చేస్తుండగా.. ఆ సంగీతానికి ఆకర్షితుతయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అందరితోపాటు డ్యాన్స్ చేశాడు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పిల్లవాడని ఆరోగ్య పరిస్థితి గురించి తెలియక అతని చుట్టుపక్కల వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే గమనించిన తల్లి జమునా దేవి సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో అందరూ ఆగిపోయారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యు ప్రకటించారు.
అయితే సమర్ తండ్రి, కైలాష్ బిల్లోర్, డీసే సౌండ్ అత్యంత ప్రమాదకరంగా ఉండటమే తన కొడుకు చావుకు కారణమని ఆరోపించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇటువంటి సమస్యలను నివారించడానికి డీజేలకు ఖచ్చితమైన సమయం, వాల్యూమ్ పరిమితులు ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment