heavy sound
-
విషాదం: డీజే సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు
ఇటీవల డీజే ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతి శుభకార్యంలో భారీ భారీ సౌండ్ సిస్టమ్ కామన్ అయిపోయింది. దద్దరిల్లిపోయే డీజే చప్పుళ్లకు చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. మితిమీరిన సౌండ్, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ బాలుడు భారీ డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.భోపాల్‌లో సమర్ బిల్లోర్ అనే 13 ఏళ్ల బాలుడు స్థానిక పండుగ వేడుకలో తన వివాసం వెలుపల డీజే సౌండ్‌కు ప్రజలు డ్యాన్స్ చేస్తుండగా.. ఆ సంగీతానికి ఆకర్షితుతయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అందరితోపాటు డ్యాన్స్ చేశాడు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పిల్లవాడని ఆరోగ్య పరిస్థితి గురించి తెలియక అతని చుట్టుపక్కల వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే గమనించిన తల్లి జమునా దేవి సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో అందరూ ఆగిపోయారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యు ప్రకటించారు.అయితే సమర్ తండ్రి, కైలాష్ బిల్లోర్, డీసే సౌండ్ అత్యంత ప్రమాదకరంగా ఉండటమే తన కొడుకు చావుకు కారణమని ఆరోపించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇటువంటి సమస్యలను నివారించడానికి డీజేలకు ఖచ్చితమైన సమయం, వాల్యూమ్ పరిమితులు ఉండాలని కోరారు. -
డీజే సౌండ్‌తో గుండెపోటుకు గురై మహిళ మృతి.. డీజే ఏర్పాటు చేసింది?
కొండమల్లేపల్లి: దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లిలో ఓ రాజకీయ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో డీజే సౌండ్ కారణంగా ఓ మహిళ గుండెపోటుకు గురై మృతి చెందింది. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన గుంటోజు అమృతమ్మ(51) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోర్ పిన్ డిజే సౌండ్స్‌తో తీవ్రమైన శబ్దాన్ని తట్టుకోలేక అమృతమ్మ గుండెపోటుకు గురై కుప్పకూలింది. దీంతో స్థానికులు ఆమెను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమృతమ్మను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని పోలీసులు తెలిపారు. కోళ్ల దాణా లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా మాడుగులపల్లి: కోళ్ల దాణా బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన మాడుగులపల్లి మండల పరిధిలోని టోల్‌ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి కోళ్ల దాణా(సోయాపొట్టు) బస్తాల లోడ్‌తో లారీ ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు బయల్దేరింది. మార్గమధ్యలో మాడుగులపల్లి టోల్‌ప్లాజా సమీపంలో రోడ్డు దిగుడుగా ఉండడాన్ని డ్రైవర్ గుర్తించకపోవడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దాణా బస్తాలను మరో లారీలోకి లోడ్ చేసి క్రేన్ సాయంతో బోల్తా పడిన లారీని పైకెత్తారు. -
రయ్ రయ్‌మంటూ రోడ్లపైకి.. 5 నిమిషాల్లోనే ‘పెద్దల’ నుంచి ఫోన్స్
సాక్షి, హైదరాబాద్: అతివేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్ధం ఇచ్చే సైలెన్సర్ల గోల.. కరోనా లాక్‌డౌన్‌తో వీటన్నీంటికి కొంతకాలంగా బ్రేక్ పడింది. అనంతరం కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్‌తో మళ్లీ మొదలయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో గత రెండు వారాల నుంచి దూసుకెళ్తున్న బైక్‌లు, కార్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ► కొత్తకొత్త మోడల్స్‌లో వస్తున్న కార్లు, బైక్‌లు రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్తున్నాయి. గతంలో శని, ఆదివారాల్లో రాత్రిపూట మాత్రమే తిరిగిన ఈ స్పోర్ట్స్ బైక్‌లు, కార్లు ఇప్పుడు పట్టపగలు కూడా సాధారణ రోజుల్లో చెలరేగిపోతున్నాయి. ► గతంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పోష్ లొకాల్టీల్లో ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహించే వారు. అదుపుతప్పిన వేగం, అధిక శబ్ధంతో వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించే వారు. ► కోవిడ్ కారణంగా గత ఏడాదిన్నర నుంచి పోలీసుల తనిఖీలు అటకెక్కాయి. ఇదే అదనుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి రోడ్లు సైలెన్సర్లు తొలగించిన వాహనాల అధిక శబ్ధంతో అల్లాడిపోతున్నాయి. చదవండి: ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు: సీపీ అంజనీ కుమార్ ► శబ్ధ కాలుష్యం ఒకవైపు, మితిమీరిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇంకోవైపు సాధారణ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ► పబ్‌ల నుంచి బయటికి వచ్చే క్రమంలో యువత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు, బైక్‌లపై అర్ధరాత్రి అతివేగంతో దూసుకెళ్తుండటంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ► ఒకవైపు అధిక వేగం ఇంకోవైపు అధిక శబ్ధం స్థానికులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉంది. ► గడిచిన ఏడాదికాలంగా సంపన్నులు నివసించే ఈ కాలనీల్లో 250కి పైగా ఖరీదైన కార్లు రోడ్లెక్కాయి. ఇందులో చాలా కార్లకు ఇంకా నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయలేదు. దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించడం లేదు. పొరపాటున పట్టుకుంటే ఫోన్‌కాల్స్... ► కోట్లాది రూపాయలు వెచ్చిం కొనుగోలు చేస్తున్న కొత్త మోడల్ కార్లను అదుపుతప్పిన వేగంతో నడుపుతున్న వారిని పొరపాటున పోలీసులు ఆపితే వారికి ఐదు నిమిషాల్లోనే ‘పెద్దల’ నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ► ఆ కారు మన వాళ్లదే.. వదిలేయండి.. అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇక వీటిని పట్టుకోవడం ఎందుకంటూ వదిలిపెడుతున్నారు. ► ఇదే అదనుగా బడాబాబుల పుత్రరత్నాలు చెలరేగిపోతున్నాయి. ► రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఓ సమావేశానికి బందోబస్తుకు వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసులకు ఆ రోడ్లపై రయ్..రయ్.. మంటూ దూసుకెళ్తున్న ఫెరారీ కారు కనిపించింది. దీంతో ఆ కారు ఆపి నడిపిస్తున్న వ్యక్తిని ప్రశ్నించగా కొద్దిసేపట్లోనే పోలీసులకు ఆ కారు వదలాలంటూ ఫోన్‌కాల్ వచ్చింది. చదవండి: రెండు తలల పాము @ 70 లక్షలు.. ఈ పాము ఇంట్లో ఉంటే.. -
దడ పుట్టిస్తున్న సైలెన్సర్లు!
మామూలు శబ్దం కాదు.. తుపాకీ నుంచి తూటా దూసుకొచ్చినంత సౌండ్. రాకెట్లాగా నిప్పులు చిమ్ముకుంటూ ప్రయాణం.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగం.. అంతా కుర్రకారే.. రేసుల కోసం.. ప్రత్యేక ఆకర్షణ కోసం.. ప్రజలకు దడ పుట్టిస్తున్నారు. బుల్లెట్ వాహనాలకు వింతైన సైలెన్సర్లను బిగించి రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. తెనాలిలోని ఓ వ్యాపారి తన కుమారుడు బీటెక్ పూర్తి చేసిన ఆనందంలో అతని కోరిక మేరకు బుల్లెట్ కొనిచ్చాడు. అప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ఓ మెకానిక్ అధిక శబ్దంతో పాటు నిప్పులు చెరిగే సైలెన్సర్లు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న యువకుడు నేరుగా అక్కడకు వెళ్లి మెకానిక్ కోరినంత డబ్బు ఇచ్చి నిప్పులు చెరిగే సైలెన్సర్‌ను వాహనానికి బిగించుకున్నాడు. దీంతో రాత్రి వేళల్లో ప్రధాన రహదారులపై హల్చల్ చేస్తున్నాడు. నిప్పులు చెరుగుతూ బుల్లెట్ వెళుతుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ.. రోడ్డు పక్కకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు బైక్ రేసులకు రహస్యంగా వెళ్లడం ప్రారంభించాడు. గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు జిల్లాలో గడచిన నాలుగేళ్లలో యువతలో బుల్లెట్ల క్రేజ్ పెరిగింది. అధునాతనంగా తీర్చిదిద్దిన వాహనానికి అదనపు హంగులు కోసం ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కొందరు మెకానిక్‌లు వారిదైన శైలిలో యువత మోజును క్యాష్ చేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే మరి కొందరు జిల్లాలోనే నకిలీ సైలెన్సర్లను తయారు చేసి గుట్టుగా విక్రయాలు చేస్తున్నారు. మార్పులు ఇలా... జిల్లా వ్యాప్తంగా గడచిన నాలుగేళ్లలో ప్రతిఏటా సగటున 700 బుల్లెట్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. అధికంగా యువత వాటినే కొనుగోలు చేసేందుకు ఆసకి చూపుతున్నారు. వాహన కొనుగోలు చేసిన అనంతరం బుల్లెట్‌కు నిబంధనల ప్రకారం 70 నుంచి 80 డెసిబుల్స్ లోపు శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేస్తారు. అయితే వాటిని తొలగించి వాటి స్థానంలో 90 నుంచి 160 డెసిబుల్స్ సౌండ్ వచ్చే వాటిని బిగించుకుని హంగామా సృష్టిస్తున్నారు. అయితే వీటితో పాటు పటాకా పేరుతో నూతనంగా మార్కెట్లోకి మంటలు వచ్చే సైలెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. రకాలను బట్టి రూ.2 వేల నుంచి రూ.28 వేల వరకు మెకానిక్‌లు వసూలు చేస్తున్నారు. వాటితో పాటు అధిక శబ్దం వచ్చే విధంగా హారన్లను బిగిస్తున్నారు. ఇలా అదనపు హంగులను ఏర్పాటు చేసుకుంటున్న యువత రహస్యంగా బైక్ రేస్‌లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గత నెలలో విజయవాడలో బైక్ రేస్ నిర్వహిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కొందరు మెకానిక్‌లు తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి ఆర్డర్లపై సైలెన్సర్లను తెప్పించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో నకిలీ సైలెన్సర్ల తయారీ.. ఇదిలా ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి మండలాలను బైక్ రేసులకు అనువైన ప్రాంతంగా యువత ఎన్నుకొంటోంది. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఏకంగా విజయవాడ, తాడేపల్లి, మంగళగిరితో పాటు తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో నకిలీ సైలెన్సర్లను తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్న సైలెన్సర్లు అధిక రేటు కావడంతో యువత తక్కవ ధరకు వచ్చే వాటిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారి నకిలీలను తనకు నమ్మకమైన మెకానిక్‌లకు మాత్రమే అమ్ముతున్నట్టు సమాచారం. తెనాలిలో ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కానిస్టేబుల్ చెందిన దుకాణంలో మెకానిక్ విజయవాడ నుంచి సైలెన్సర్లను తెప్పించి మరీ విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. భారీ శబ్దం వచ్చే హారన్లు, సైలెన్సర్లను బిగించి వాహనాలతో రోడ్లపై యువత హల్చల్ చేస్తున్నారు. ఫలితంగా తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక గుండెపోటు వున్న వారి సంగతి అంతే. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రవాణా, పోలీస్, శబ్ద కాలుష్యం శాఖల మధ్య సమన్వయం లోపంతో యువత ఇష్టాను సారంగా రెచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. -
లారీ ఢీకొన్న శబ్దంతో ఆగిన డ్రైవర్ గుండె
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ స్టీరింగ్‌పైనే కన్నుమూశాడు. వివరాలివీ.. విజయవాడ గుంటుపల్లిలోని సింగ్‌నగర్‌కు చెందిన ఇబ్రహీం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఇసుక క్వారీ దగ్గరకు తన లారీతో వచ్చాడు. లారీని హైవే పక్కన క్యూలో పెట్టేందుకు రివర్స్ చేస్తున్నాడు. అయితే, అది ప్రమాదవశాత్తు వెనుక ఉన్న మరో లారీని ఢీకొనటంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఒక్కసారిగా గాభరాకు గురైన ఇబ్రహీం గుండెపోటుతో స్టీరింగ్‌పైనే కుప్పకూలాడు. ఆయనకు గతంలో కూడా రెండుసార్లు గుండెపోటు వచ్చిందని తోటివారు తెలిపారు.